Jump to content

పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

131


పదియవ అధ్యాయము

హలములలో ముగ చూడబడిరి. భూమివిడిచి వెళ్ళుటకు వీలు లేక ఎల్లప్పు డను స్త్రీలుసు పురుషులును అధిక శ్రమతో పనిచేయుచున్నను, మిగుల ఘోరమగు దారిద్రమునే యనుభవించుచుండిరి. ప్రమభవు లెప్పుడు తలచిన నప్పుడు రయితుల పొలములో గూడ వేటాడుచు పోవచ్చును. పయిర్ల నష్ట పరిహార మియ్యనక్కర లేదు. ప్రభువులు తమ న్యాయస్థానములలో రయితులను కూలీలను : సామాన్యజనులను విచారించి శిక్షలు సేయవచ్చును. భూమి పన్నులుమాత్రమేగాక బీదలను పీడిం చుటకు ఉప్పపన్ను కూడకలదు ప్రభుత్వమువారె ఉప్పును తచూరు చేసి అమ్మవలెను: . ఇతరరులు తయారు చేసిన ఖైదులో నుంచుచుండిరి... మత స్వేచ్ఛ బొత్తిగ లేదు.

ప్రభుత్వమునందు
ద్వేషము

ప్రభుత్వము. ప్రజలను రక్షించుట లేదు. దుష్టమగు పరి పాలన పద్దతుల వలనను పన్నుల భారము వలనను ప్రజల దౌర్భాగ్యమినుమడించు చుండెను. క్షామము, దేశములో స్థాపనమేర్పరచుకొనెను. రోగములు విశేషమయ్యును, పాణములకును ఆస్తులకు స్వేచ్ఛకును సు రక్షితము లేదు. ప్రజల మరణము లెక్కు వయ్యెను. ఆయుష్య ము క్షీణించు చుండెను. ఎక్కడ చూచినను భోజనము లేనట్టియు గృహములు లేనట్టియు బిచ్చగాడ్ర గుంపులు కన్పించుచుండెను. తమయొక్క దుఃఖముల కన్నిటికీ ప్రభుత్వమే కారణమనియు, దీనిని తలకిందు చేసి మరియొక ప్రజాహితకరమగు ప్రభుత్వ మును స్థాపించుకొనినగాని తమ కష్టములు తొలగవనియు ప్రజలు తలచిరి. మరియు ప్రజలు తమ్ము నొత్తిడి చేయుచు