పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

121

తొమ్మిదవ అధ్యాయము

ఇట్టి స్థితిలో 1756 వ సంవత్సరమున ఏడు సంవత్సరము లయుద్ధము ప్రారంభ మయ్యెను. ఆస్ట్రియా రాణి సైలీషియాను హిందూ దేశమును ప్రష్యా రాజునకు వదలి వేయుట కిష్టము లేకయు పోగొట్టుకొనుట, యుద్ధమునకు వెడలెను. ప్రష్యా రాజుపక్షమున ఇంగ్లాండు చే రెసు. ఆస్ట్రియారాణి పక్షమున ఫ్రాన్సుచేరెను. 1763 వరకు ఏడు సంవత్సరములు యుద్ధము జరిగెను. ఇంగ్లాం డు యొక్కయు, ఫ్రాన్సు యొక్కయు చరిత్రలలో నింత ప్రాము ఖ్యమైన యుద్ధము మరి యొకటి లేదు. ఆస్ట్రియాయు, ప్రష్యా యు, యూరోపులో నాధిక్యతకు పోరాడుచు ప్రపంచ రాజ్యము కొరకు ఫ్రాన్సు, ఇంగ్లాండు దేశములు పోరాడుచుండె సు. ఫ్రాన్సునకును ఇంగ్లాండునకును ముఖ్య యుద్ధములు ఉత్తర అమెరికాలోను హిందూ దేశములోను జరిగినవి. ఇంగ్లాండు దేశపు ప్రధానమంత్రి యుగు విలియంపిట్ బహుసమర్థతతో కార్యభారము వహించి సరిగా సైన్యములను' నౌకాదళము లను పంపి యుద్ధమును జాగ్రత్తగా నడిపెను. ఫ్రాస్సురాజుగు " పదు నేనవలూయి చపలచిత్తలగు ,ఉంపుడుకత్తెలచే నడుపబడి సరిగా హిందూ దేశమునకును అమెరికాకును దవ్యమును సేనల ను పంపక యుద్ధమును పాడుచేసెను. యూరపులో ప్రష్యా జయమంది ఆస్ట్రియాకస్న - ముఖ్యమైనది. హిందూ దేశము లో సమర్థుడగు డూప్లేను 'ప్రెంచి ప్రభుత్వ మువారు సహా యము చేయకపోగా ఫ్రాన్సుకు పిలిపింఛుకొని అనమాన