పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
120

ఫ్రెంచిస్వాతంత్ర విజయము

కనడా దేశములో ఫ్రెంచివలస రాజ్యము స్థాపించబడి పెరుగుచు న్నది. అచట ఫ్రెంచి వారికి విశేషలాభము కలిగినది. హిందూ “దేశములో ఫ్రెంచి వర్తక స్థానములు బాగుగ వృద్ధి చెందుచు న్నివి. పుదుచ్చేరి గవర్నరగు డూప్లే అనునతడు, అప్పుడు హిందూ దేశములోని స్వదేశ సంస్థానాధీశులలో ప్రబలుచున్న అంతఃక లహములలో ప్రవేశించియు, హిందూ దేశీయులను ఫ్రెంచి సేనాధిపతులక్రింద సిపాయిలుగ శిక్షణమునిచ్చి ఉప యోగించియు, హిందూ దేశములో గొప్ప ఫ్రెంచిసామ్రాజ్యమును స్థాపించవలెననీ యత్నము చేయసాగెను. అమెరికాలోను హిందూ దేశములోను కూడ ఇంగ్లీషువ ర్తక సంఘము లే ఫ్రెంచి వారికి పోటీగనుండెను, హిందూదేశములో ఆంగ్లేయ వర్తకులు గూడ స్వదేశ రాజుల అంత్ఃకలహములలో ప్రవేశించియు, హిందూ దేశీయులను ఆంగ్లేయ సేనాధిపతుల క్రింద సైనికులుగ తరిబీయతు చేసియు ఆంగ్లేయరాజ్యమును ఏర్పరచ వలెనని తలచిరి. ఫ్రెంచివారి స్థితియే ఆధిక్యతను పొంది యుండెసు. ఫ్రెంచి రాజు మాత్రము కొంతకాలము పొంపడారు యువతి యొక్క యు, మిగతకాలము డుబెర్రి యువతి యొక్కయు చేతులలో నుండెను. ఈ యుంపుడు కత్తెల నిమిత్తము సాలుకు నలుబది లక్షలు పరాసు ప్రభుత్వబొక్క సములోనుండి ఖర్చగుచుండెను.