పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105

ఎనిమిదవ అధ్యాయము

లను కట్టించెను. పరాసు దేశము యొక్క ఉన్ని పరిశ్రమ, లోహ పుపనులు, చర్మపు సరుకులు, జరీ పనులు, తివాచీలు, పట్టు, గ్లాసు, పింగాణీసామాను మొదలగు ననేకవిధములగు పరిశ్రమలు మిక్కిలి వృద్ధియయ్యెను. దేశములోని వర్తకము నేగాక సముద్రముమీద విదే శవర్తకమును కూడ పెంపొందించెను. 1665 సంవత్సరమున సముద్రములమీద వర్తకమును వృద్ధి చేయుట కొర కొక సంఘమును నియమించెను. దానికి ప్రతి పదునైదు దినములకు రాజు స్వయముగ నధ్యకతను వహించు చుండెను. ఆ కాలమునడచ్చి (వలాందా) వారు సముద్రవర్తక మునందు మిక్కిలి ఖ్యాతివహించియుండిరి. వారికి పదునారు వేలనావ లుండెను. వాని మీద ప్రపంచములోని వివిధ దేశములతోను వర్తకముచేయుచు మిగుల ధనికులై యుండిరి. పరాసుదేశమునకు ఆరు వందలకన్న నెక్కువ ఓడలు లేవు, డచ్చి వారితో పరాసులు తులతూగునట్లు చేయవలెనని రాజును, కాల్బర్టును నిశ్చ యించిరి. శీఘ్రముగ పెక్కు పడవలను నిర్మాణము గావించిరి. పరాసు రేవులకు వచ్చు విదేశ పడనలమీద పన్నులను విధిం చిగి. సముద్రములమీద వర్తకముచేయు పరాసు వర్తకులకు సహాయముచేసి. విదేశములతో వర్తకము చేయుట కైదు వర్తక సంఘముల నేర్పరచి వానికి వర్తక పుహక్కుల నిచ్చియు ఋణముల నిచ్చియు ప్రోత్సహించిరి. హిందూ దేశ ప్రాంతములతో వర్తకము చేయుటకు ప్రెంచి ఈస్టు ఇండియాకంపెనీని, అమెరికాతో వర్తకము చేయుటకు ఫ్రెంచి వెస్టిండియా