పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
104

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

కాల్పర్టు మంత్రి

కాల్బర్టు 1619 సంవత్సరమున నొక గొప్ప వర్తకులయింట జన్మించెను. పరాసు ప్రభుత్వపు కొలువులో ప్రవేశించి మెజరీసు క్రింద పనిచేయు చుండెను. మెజరీను కాబర్టు యొక్క సమర్థతను బాగుగ గ్రహించి చని పోక ముందు రోజున కీతనిని మిగుల సమర్థుడని వప్పగించెను. కాల్బర్టును రాజు 1661వ సంవత్సరముననే ముఖ్యమంత్రి జేసెను. గొప్ప విద్వాంసుడు. బహు యోగ్యుడు. మిగుల కష్టపడి పనిచేయు వాడు, ఆర్థిక విషయములలో మిగుల సమర్థుడు. కాల్బర్టు నందు రాజునకు గూడ విశేషమగు నమ్మకము గౌరవము గలవు. ప్రభు త్వము యొక్క యార్థిక దుస్థితిని తొలగించుటకు కాల్బర్టు కృషి సలి పెను. ప్రతి సంవత్సరమును ముందుగనే ప్రభుత్వము యొక్క ఆదాయ వ్యయపట్టికను తయారుచేసి ఆదాయమునకు తగినట్టులే ఖర్చు చేయుచు వచ్చెసు. కాల్బర్టు మంత్రి యైన 1661 వ సంవత్స రమున ఆదాయము 8 1/2 కోట్లు. వ్యయము పదకొండుకోట్లు. ఈ యన మరణించిన 1683 సంవత్సరమున ఆదాయము పదకొండు కోట్లు, వ్యయము తోమ్మిది కోట్లు నయ్యెను. పరాసు దేశముయొ క్క వ్యవసాయాభివృద్ధికిని పారిశ్రామికాభివృద్ధికిని కాల్బర్టు విశేష ముగ తోడ్పడెను. విదేశముల నుండి దిగుమతియగు సరుకుల మీద పన్నులు వేసియ, దేశములోని నూతన పరిశ్రమలకు ధనసహా యము చేసియు, నిపుణులైన పారిశ్రామికులను పరాసు దేశమున కాకర్షించియు, పారిశ్రామికుల మధ్య తగాదాలను పరిష్కరిం చుటకు పంచాయితీల నేర్పరచియు పెక్కు విధముల దేశీయపరి శ్రమలను సంరక్షించెను. రోడ్లు, కాలువలు నిర్మించెను. రేవు