పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

103

ఎనిమిదవ అధ్యాయము


స్థిరపరచెను. తిరిగి యెట్టి అడ్డు లేకుండ రాజు యొక్క నిరంకుశాధికారము 1789 వ సంవత్సరపు విప్లవము వరకును అప్ర తిహతముగ సాగెను.


మెజరీసు విదేశ వ్యవహారములలో సమర్ధత చూపెనే గాని పరాసుదేశపు ప్రభుత్వము యొక్క ఆర్థిక స్థితిని బాగుచే యలేదు. ఈయన మరణించు సరికి పరాసుదేశము నలువది మూడుకోట్ల ఋణములో నుండెను. అవివాహితుడగు మత గురువయినను ఈయన విశేషముగ ధనము నపహరించి, చని పోవుసవుడు పదికోట్లధనమును తసబందువులకు విడిచి పెట్టెను, ఈయన కాలమున నొక గొప్పగ్రంథాలయమును, నొక సర్వకళా శాలయు, శిల్పము, చిత్తరువులు, చిత్రలేఖనము నేర్పు క ళా శాలను స్థాపించెను. ఈయన l661 సంవత్సరమున చని పోయెను.

(3)

పదనాలగవ
లూయి రాజ్య
భారమును వహించుట

1661 సంవత్సరమున లూయి రాజు స్వయుగ రాజ్య భారమును వహించినపుడు ఇరువది మూడు సంవత్సరముల వయసు గలదు. మెజరీను మరణించగనే మంత్రులీయన వద్దకు వచ్చి ఇంతట నుంచి ఎవరికిని జవాబు చెప్పవలసియుండునని యడుగగా తనకేనని యీయన ప్రత్యుత్తర మిచ్చెను. దినమునకు ఎనిమిది గంటల కాలము రాజ్యపాలన సంబంధమగు కార్యములలో విని యోగించి ప్రతిపనిని తాసు స్వయముగ చేయుచు వచ్చెను. రాజే ముప్పది సంవత్సరముల వరకు ప్రధానమంత్రిగ నుండెను.'