పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
106

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము


కంపెనీని, ఉత్తర దేశములతో వర్తకము చేయుట కొక సంఘ మును, లివాంటు, సెనిగలు అను మరి రెండు సంఘములను, స్థాపించిరి. ఈస్టుఇండియాకంపెనీకి అరువదిలక్షలు రుణ మునిచ్చిరి. ఈవిధముగనే ఇతర సంఘములకును నిచ్చిరి. పరాసు దేశముయెక్క వలసరాజ్య ములను కూడ వృద్ధి చేయుటకు ప్రయత్నించిరి. కయేనిలోను, కనడా లోను రాజ్య మును విస్తరింప జేసిరి. ఉత్తరం అమరికాలోని టెర్రానోవ నాక్రమించుకొనిరి. 1680 వ సంవత్సరమున ఉత్తర అమెరి కాలోని మిసిసిపి చుట్టునున్న ప్రాంతములో పరాసులు వలస నేర్పరచిరి. ఆఫ్రికాలో 1665 వ సంవత్సరమున సెనగలును, మడగాస్కరు యొక్క తూర్పుతీరమును స్వాధీన పరచుకొని. తూర్పు ఇండియావర్తక సంఘము వారు హిందూదేశములోని సూరతు, చంద్రనాగూరు, పుదుచ్చేరి పట్టణములను సంపా దించిరి. రాజును మంత్రియు పరాసు దేశము యొక్క. నావి కాదళమును విశేషముగ వృద్ధి చేసిరి. బలమైన నావికాదళము లేనిది. వలసరాజ్యములు నిలువ నేరవని బాగుగ గ్రహించి. నౌకానిర్మాణశాలలను కట్టించి నూతన నౌకలను నిర్మాణము గావించిరి. టూలూను రేవును విరింప జేసి ప్రపంచములో మిక్కిలి సొగసైన రేవులలో నొకటిగ చేయించిరి.


లవ్వేమంత్రి యుద్ధమంత్రిగనుండి సైనికాభివృద్ధిని చేసి పరాసు కాల్బలమును గుఱ్ఱపుదళమును యూరపులో కెల్ల శ్రేష్ఠ మైనవిగా గావించెను. వాబా అను సుప్రసిద్ధ నిర్మాణ కౌశలుడు పరాసు దేశపు సంరక్షణకై వివిధ సరిహద్దులలోను బలమైన