పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

ఎనిమిదవ అధ్యాయము

రాజుల నిరంకుశత్వము

(1)

రాజులు
నిరంకుశులగుట.

ఫ్రాన్సు దేశపు రాజగు నాల్గవ హెన్రీ సమర్థుడు. ఫ్రాన్సులో గలిగిన అంతర్యుద్ధములు రాజులయొక్క అధికారమును బలపరచినవి. స్టేట్సు. జనరరలు (దేశప్రతి నిథి సభ) ను తిరిగి సమకూర్చనే లేదు. దేశప్రముఖుల నప్పుడప్పుడు పిలిచి రాజు సలహా నందుచుండెను. ప్యారిసుపట్టణములోని (సార్లమెంటు) న్యాయాధిపతుల సంఘ సభ్యులమీద నొక పన్ను వేయబడి వారియధికారము వంశపారంపర్యమైనదిగా చేయబడెను. ఇందువలన వారు తమ పదవికి రాజునుగ్రహమునకు లోబడ కొంతవఱకు స్వతంత్రులై రి.నాల్గవ హెన్రీ మంత్రియగు సల్లీ ఆర్థిక విషయములలో బహు సమర్థుడై రాజునకు సర్వవిధములను తోడుపడెను. .