Jump to content

పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
98

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

పదుమూడవ
లూయి

1610 వ సంవత్సరమున నాల్గవ హెన్రీ చంపబడినందున . ఆయన కుమారుడగు పదునొకొండువత్సరముల వయస్సుగల పదుమూడవ లూయి రాజయ్యెను. రాజమాత. యగు మేరి-డి- మెడిసి రాజ్యభారమును వహిం చెను. ఆ మెపాలనము ప్రథమమున ప్రజానురంజకముగ లేదు. కాని 1624 వ సంవత్సరమున అదృష్టవశమున గోప్ప మేధావి యుగు కార్డినల్ రిచ్లూ ఆ మెకు మంత్రిగా లభియించెను. ఇంత నుండియు పరాసు దేశము యూరఫుఖండములో ప్రధాన స్థానమును వహించెను.


1524 మొదలు 1642వ సంవత్సరమున ఆయన చనిపోవు వరకును రిచ్లూ మంత్రి పుంగవుడు యూరఫుఖండపు రాజ్యాంగపు వ్యవహారములలో ముఖ్యుడుగ' నుండెను. ఈ యన యు దదేశ్యములు రెండు: ప్రాన్సులో ప్రభువుల యొక్కయు, న్యాయాధిపతుల యొక్కయు, హ్యూజి నాట్ల యొక్కయు అధికారములను, పలుకుబడిని అణచి వేచి రాజును నిరంకుశునిగ చేయుట ఒక యుద్దేశ్యము. ఫాన్సుకు పోటీగనున్న ఆస్ట్రియా, "స్పెయిన్ దేశములకు నష్టము కలుగ చేసి ఫ్రాన్సు దేశమును యూరపుఖండములో కెల్ల నుత్కృష్ట మైనదిగ జేయుట రెండవ యుద్దేశ్యము. ఈయన ఫాన్సు లోని ప్రొటెస్టెంటులగు హ్యూళినాట్ల నోడించి వారిని రాజునకు లోబ బిచి పిదప వారికి మత స్వేచ్ఛ నొసంగుట మనము పైన చూచి యున్నాము.