పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
96


ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఔరంగ జేబు చక్రవర్తి చేసిన పొరబాటులకు ఫలితముగ ఛత్ర పతిశివాజి, రాజపుత్రులు మొదలగు హిందూరాజులు తిరుగు బాటులు ప్రారంభించగా ఔరంగ జేబు చక్రవ ర్తి కాలములో బలహీనమయి ఆయన మరణించగనే మొగలాయిరాజ్య మస్త మించెను.


మొగలాయి రాజుల కాలమున హిందూ దేశము మత స్వే చ్ఛను శాంతిని ఐశ్వర్యమును అనుభవించి లోకములో కెల్ల నగ్రస్థానము వహించియుండెను. ఆకాలమున నీదేశములో ప్రబలియున్న పరిశ్రమలు, వర్తకము, ఐశ్వర్యము, సురక్షితము ధనార్జనము కొరకై యూరపుఖండవాసుల నిచటి కాకర్షించెను. మఱియు హిందూ మహమ్మదీయ మతముల రెంటిలోను గల యుత్కృష్టమగు సిద్ధాంతములను సమన్వయము చేసి నూత నోద్యమములను ప్రతిష్ఠించిన కబీరు, నానకు, తుకారాం, చైతన్యుడు మొదలగు సంస్కర్తలు పెక్కు మంది బయలు దేరిరి, హిందూమహమ్మదీయ నాగరికతలు గంగాయమునల విశుద్ధ ప్రవాహములవలె సమ్మేళనము చెంది భరతవర్షము యొక్క ఇతిహాసమునకు నూతనశోభను కలుగ జేసెను.