పుట:February 2020.అమ్మనుడి.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. కోలగాడు ఎదురురావడం దుశ్శకునం, కోలగాడు మాలవాడు, మాలవాడు ఎదురురావడం దుశ్శకునం, కొండరాజుల కోలగాడు కొండగొర్రె, కొండగొర్రె అరిస్తే దుశ్శకునం.

6. పరిమి - పరిమి ఆకుల్లో రాజులకు పెతర్లకు మాంసం నైవేద్యం పెడతారు, చచ్చినవాడి దయ్యం వెంటరాకుండా స్మశానం దారిలో పరిమి ముల్లు వేస్తారు.

7. తిత్రికపిట్ట రెట్టలో విత్తనానికి రణం మొలుస్తుంది. అసలు చెట్టు క్షీణిస్తుంది, తిత్రిక పిట్ట పక్షి ప్రపంచంలో 'చెడుపు” ముండ. “చెడుపు” ద్వారా శరీరంలో, భూమిలో “తాపడం” ప్రవేశపెడతారు, గొరవలు, వెజ్జులు శివసారులు ఈ “తాపడం తీస్తారు.

8.సంస్మారాలు :

ప్రకృతి : భూమికి బొద్దు - ఆకసానికి అడ్డు...చేమదుంప, చేమ ఆకు, ఇసుకను మప్పినవాడు - చెద, పచ్చిమాంసం పచ్చినీళ్ళ స్నానం పచ్చి బద్దలు.

సంస్కృతి : అడ్డుగుడ్డ కట్టిన ఆడది మొలతాడు కట్టిన మగవాడు, ఇల్లు సేయడం, కుండన వండినది అంబలి (ఉడికించడం), పెంకన వేపింది సురువులు (వేయించడం), గోరు కోసిన కోడి (ముడుపు కట్టడం) అడిగిన పిల్ల కడిగిన ముఖం కాల్టొక్కి కంకణం కట్టవాలె (కన్యాదానం)

అర్ధవిపరిణామం వంటి భాషా శాస్త్ర సూత్రాలే సంస్కృతికి కూడా వర్తిస్తాయి. నమ్మకాలుగా స్థిరపడతాయి. వాటి గతిశీలం తెలుసుకుంటే" శాస్త్రాలలో, లెక్కలను మెట్రిక్‌ పద్ధతిలోకి, నాణేలను, అణా, బేడలనుండి పైసలలోకి, రాతకోతలను టైపు, కంప్యూటరులోకి మార్చుకుంటున్నట్లు” సంస్కృతిలో దేశ కాలానుగుణమైన మార్పులు చేసుకోటం సులభమౌతుంది. లేకపోతే నమ్మకాలు, మూఢనమ్మ కాలుగా మారి ముందరి కాళ్ళకు బంధమేస్తాయి. తెలుగు సంస్కృతి నమ్మకాల వర్గీకరణ, విస్తరణలను గిరిజన సాహిత్యం, కర్మకాండ, సాధన సామగ్రి స్పష్టం చేస్తాయి. అనేక భాషలలో విస్తృతిని, కృత్రిమ మేధ సహకారంతో సాంకేతిక భాషలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్న నేటి తరుణంలో, సంస్కృతి నిర్మాణంలో క్రమాన్ని ఆవిష్కరించే ఈ ప్రయత్నాలు చాలా అవసరం.

సుస్థిర అభివృద్ధి, సతత హారిత విప్లవం, సేంద్రియ వ్యవసాయం, అంటూ అభివృద్ధి దిశ మార్చుకుని సంస్కృతి వైపు మళ్ళుతూ అడవులు. భూములు, బీళ్ళు-తరతరాలుగా వీటిపై బతుకుతున్న జాతుల వాడుకలను, వారి మేధోజనిత హక్కులు గుర్తించటానికి చట్టాలు చేస్తున్న ఈ తరుణంలో, భాషా సాపొత్యవేత్తలు ఈ కృషిలో ప్రముఖ పాత్ర వహించాలి.

“భాష ఉపకరణంగా మనవిజ్ఞానం ఎంత పెరిగితే ,భాష అంత పెరుగుతుంది. వర్ణమాన భాషలో ప్రమాణభాషను మాండలిక సమ్మేళనంతో సులభగ్రాహ్యం చేయటం అవసరం.”

“తెలుగు రచనల్లో సాహిత్యమైనా శాస్రమైనా అంతర్జాతీయ స్థాయికి రాదగిన గుణం ఉంటేనే తెలుగు భాష అంతర్జాతీయ భాష అవుతుంది. మన పెద్దల ఒకనాటి (1960) ఈ సంకల్పాలకు ఇప్పుడైనా ప్రాణం పోయాలి.

గురజాడ

తెలుగు పద్యాలు ముత్యాల పందిరేసి
అమ్మభాషకు అలరారు పూలు పూయింబి
మాటకూ పాటకూ సొగసులు చిందించిన
వ్యవహారిక భాషా ఘురి గురజాడ

ఆయన తెలుగు భాషకు కొత్త ఊపిరి
అందుకే తెలుసు ఆయన పేరు మనందరికీ

భాషా సాహిత్యాలు జాతి జీవాలు
ఎటు చూసినా తెలుగు భాషా కిరణాలు
తెలుగు పుడమిపై అస్తమయం లేని
భాషాశాస్త్ర సాహితీ సూర్యుడు గురజాడ

ఆయన తెలుగు భాషకు కొత్త ఊపిరి
అందుకే తెలుసు ఆయన పేరు మనందరికీ

అమ్మ కడుపులోంచే
అమృత సరాలు నేర్పి
ఆకాశం పలకమీద వ్యవహారిక భాషా
అఆలు రాయించిన సంస్కర్త గురజాడ

ఆయన తెలుగు భాషకు కొత్త ఊపిరి
అందుకే తెలుసు ఆయన పేరు మనందరికీ

తల్లిభాషను పుట్టుకతోనే
పాలమీగడల పాయసంగా తినిపించి
వ్యావహారిక భాషకో దిదుబాటు చేసిన
పండిత పామరుల బంధుమిత్రుడు గురజాడ

ఆయన తెలుగు భాషకు కొత్త ఊపిరి
అందుకే తెలుసు ఆయన పేరు మనందరికీ

జి.నరసింహమూర్తి 8977987266

జాతీయస్థాయి కథల పోటీ

ఆచార్య ఎన్‌.జి.రంగా సాహితీ పురస్కారం

  • ఆధునిక సమాజానికి చెందిన కథ అయివుండాలి
  • డిటిపిలో 10 నుండి 15 పుటల మధ్య ఉండాలి
  • డిటిపి చేసిన కథ ప్రతులు మూడు పంపాలి
  • నాగభైరవ ఆదినారాయణ - 9849799711 ను సంప్రదించాలి
  • కథలపోటీకి ఆఖరు తేదీ - 15 ఏప్రిల్‌ 2020
  • ప్రధమ బహుమతి రూ.10,000/-; మరియు 2 వేలు చొప్పున 4 బహుమతులు

డా|| జక్కంపూడి సీతారామారావు 9849497739 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2020