పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

దంపూరు నరసయ్య


ప్రదర్శించడానికి నిజంగా కారణం ఉందా? ఏ విజయాన్ని, పురస్కరించుకొని ఈ దర్బారు ఉత్సవాలు నిర్వహించారు? వీరు విధించ తలపెట్టిన ఆదాయం పన్ను ద్వారా కొన్ని సంవత్సరాలపాటు జమఅయ్యే మొత్తాన్ని ఆ దర్బారు ఒక్క గంటలో కబళించింది. సంవత్సరాదాయం 300 రూపాయలున్న పౌరుల మీద ఈ పన్ను విధించినా, ఇరవై కోట్ల దేశ ప్రజలనుంచి 7000 పౌన్లకు మించి వసూలు కాదు. ఈ దేశ దుర్భర దారిద్ర్యాన్ని నిరూపించడానికి ఈ ఒక్క విషయం చాలు. విజ్ఞులైన మన పాలకులకు ఇదంతా ఏంపడుతుంది? అధికార పీఠంమీద కూర్చొని అత్యున్నత పదవుల్లో ఉన్న అధికారులను ఏ బలమైన కారణాలు కదిలిస్తాయో సామాన్యుల ఊహకు అందదు.

ఈ కర్చంతా చాలనట్లు ఇటీవల ఒక అద్భుతమైన 'కేంపు' ఏర్పాటు చేశారు. అవును! “యుద్ధంలో అపఖ్యాతి తెచ్చిన విజయాలు” లేక అపజయాలు నిజంగానే అద్భుతమైనవి. (..................) ఇటువంటి నకిలీలను సహాయంగా తెచ్చుకున్న ప్రభుత్వం లార్డు డఫ్‌రిన్ (Dufferin), లార్డు (..................) దారిలోనే నడుస్తూంది. ఈ కేంపు 1877 ఢిల్లీ దర్బారుకు సరిజోడు కావచ్చు.

ముందుగా ఇండియా సైన్యాలను దూరదేశాల్లో దించమని ఆజ్ఞాపిస్తారు. ఆ తర్వాత ఇరవై, ముప్పై లక్షల కర్చుతో అదనపు సైన్యాలను సమకూర్చమంటారు. బాధ్యత విస్మరించి వృధాగా కర్చుచేస్తే ఈ ప్రభుత్వం దేశప్రజల హృదయపూర్వక విశ్వాసాన్ని, సహాయాన్ని ఏ విధంగా ఆజ్ఞాపించి, రాబట్టుకోగలుగుతుంది? మితిమీరిన ప్రభుత్వ వ్యయాన్ని స్థానిక పత్రికలు విమర్శించడం నేరమే, అవిధేయత ప్రకటించడమే. ఆదాయం పన్ను విధించడానికి ఏ పరిస్థితులు కారణమయ్యాయి?"

3. మద్రాసులో విద్య ఖరీదు - వ్యాసం

ఈ వ్యాసం సమగ్రంగా లభించలేదు. అందరికి ఆధునిక విద్య అందుబాటులో ఉండాలని నరసయ్య ఈ వ్యాసంలో గట్టిగా వాదించాడు. ఈ వ్యాసం అనువాదం :

“గెజిటు ప్రకటన చదివి మేము ఆశ్చర్యపడక తప్పలేదు. 1886 డిసంబరులో నిర్వహించనున్న పరీక్షలకు, ఆ వచ్చే సంవత్సరాలలో నిర్వహించనున్న పరీక్షలకు ఫీజులు పెంచారు (................) పరీక్షల నిర్వహణ అధికారులకు ఫీజులు పెంచాలనే దుర్మార్గపు ఆలోచన ఉన్నట్లుండి పుట్టుకొచ్చినట్లుంది. ఇది విద్యాభివృద్ధిని మొగ్గలో తుంచి వేయడమే. విద్య ప్రతి పౌరుడి జన్మహక్కు, పౌరులు తమ విధులను చక్కగా నిర్వహించడానికి విద్య సన్నద్ధం చేస్తుంది. ఇంగ్లాండులో, యూరపులోని ఇతర దేశాల్లో నిర్బంధ విద్యను అమలు చేశారు. విద్యలేని వ్యక్తి గనిలో ముడిఖనిజం వంటివాడు. సుగంధం వృధా చేసుకొంటూ ఎడారిలో వికసించిన గులాబి వంటివాడు. ఇప్పుడు సమస్త నాగరిక ప్రపంచం ప్రజల విద్యాభివృద్ధికి మార్గాలను అన్వేషిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల కొలమానం ప్రకారం