పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

73

నూతన సమాజ నిర్మాణం కోసం నరసయ్య

నరసయ్య బ్రహ్మ సమాజ వార్తలను, సంస్కరణోద్యమ వార్తలను, మహిళాభ్యుదయానికి సంబంధించిన వార్తలను పీపుల్స్ ఫ్రెండ్‌లో తరచుగా ప్రచురించినట్లు నిరూపించడానికి ఆధారాలున్నాయి. 1883 డిసంబరు 1వ తారీకు సంచికలో ఇటువంటి విషయాలు కనిపించాయి. కేశవచంద్రసేన్ ఆరోగ్యం మీద ఒక వార్త ఉంది. ఇదే సంచికలో నరసయ్య పండిత రమాబాయి మీద రెండు కథనాలు ప్రచురించాడు. మాక్స్‌ముల్లరు ఆహ్వానాన్ని పురస్కరించుకొని రమాబాయి ఆక్స్‌ఫర్డ్ వెళ్తుంది. అక్కడ కవి సమ్మేళనాల్లో పాల్గొని ఆశువుగా కవిత్వం చెపుతుంది. ఆమె అసాధారణ ధారణాశక్తి, నిర్దుష్టమైన సంస్కృత భాష ఉచ్చారణకు ఆక్స్‌ఫర్డ్ మేధావులు అబ్బురపాటు చెందుతారు. క్లిష్టమైన ఛందస్సుల్లో ఆశువుగా కవితలల్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె సముద్రయానం చేసిన తొలి భారతీయ మహిళ అని నరసయ్య ప్రశంసిస్తాడు. పండిత రమాబాయిని గురించిన మరొక కథనం కూడా ఇదే సంచికలో కన్పిస్తుంది. ఇంగ్లాండులో ఉన్నప్పుడు అక్కడి పత్రిక ప్రచురించిన ఆమె ఆత్మకథను నరసయ్య ఇదే సంచికలో పునర్ముద్రించాడు. రమాబాయి తండ్రి స్త్రీ విద్యాభివృద్ధికోసం కృషి చేస్తాడు. ఆయన తన భార్యకు సంస్కృతం నేర్పుతాడు. కుమార్తె రమాబాయి విదుషీమణి అవుతుంది. బాల్యవివాహాలు విద్యాభ్యాసానికి ఆటంకమనే కారణంతో తల్లిదండ్రులు తనకు బాల్యవివాహం చెయ్యలేదని ఆమె వివరిస్తుంది. రమాబాయి అక్కకు సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరుపుతారు. ఆ వివాహం విఫలమవుతుంది. రమాబాయి కథ చివర, ఈ అంశాలను ప్రస్తావిస్తూ నరసయ్య పాఠకులకు ఈ విధంగా విజ్ఞప్తి చేశాడు. "We hope this will have the effect of stipulating and encouraging the majority of Hindu fathers to stamp out the system of early marriages from this country. The case of Ramabaye's sister was only a typical one." ఆ రోజుల్లో దేశీయుల యాజమాన్యాలలోని పత్రికల్లో రమాబాయికి అనుకూలంగానో, ద్వేషపూరితంగానో మాత్రమే వార్తలు ఉండేవి.55

1886 జనవరి 30 పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో ఆర్. రఘునాథరావు, పనప్పాకం అనంతాచార్యులు హిందూ వివాహచట్టం మిద రాసిన చిన్నపుస్తకాలు, వీరేశలింగం రచనలు “పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరి" ద్వారా అమ్ముతున్నట్లు ఒక ప్రకటన ఉంది. "పేపర్స్ ఫర్ అవర్ ఎడ్యుకేటెడ్ కంట్రీమెన్ (Papers for our educated countrymen) శీర్షిక కింద “విడో రీ మేరేజస్”, “సీతా అండ్ రామా - ఎ టేల్ ఆఫ్ ది ఇండియన్ ఫేమిన్” (Sita and Rama... a Tale of the Indian famine) అనే ఇంగ్లీషు దీర్ఘ కవిత, ఇతర పుస్తకాలు విక్రయిస్తున్నట్లు ఉంది. ఇందులో మొదటిది సంస్కరణకు, రెండవది దేశ పరిస్థితికి సంబంధించింది. పీపుల్స్ ఫ్రెండ్ పుటలన్ని ఇటువంటి వార్తలతో, వ్యాసాలతో నిండినట్లు