పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

దంపూరు నరసయ్య


ఏర్పాటు చేసిన కార్యకర్తలని స్పష్టమవుతుంది. ఆనాటి మద్రాసు పత్రికలు ఈ సంఘటలను గురించి రాస్తూ "Six Reformers" అని తరచుగా పేర్కొన్నాయి. వీరేశలింగం ఈ పత్రికల నుంచి స్ఫూర్తిని పొంది స్వీయచరిత్రలో “సాంఘిక సంస్కారాభిమాన షట్చక్రవర్తులు” అని వర్ణించి ఉంటాడు.

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభించి సంవత్సరం అయింది. ఈ కాలంలోనే మన్నవ బుచ్చయ్యతో స్నేహం బలపడి ఉండాలి. మొత్తం మద్రాసు మహానగరంలో విద్యావంతులెవరూ ధైర్యంగా ముందుకురాని ఈ సంస్కార భోజనంలో నరసయ్య పాల్గొన్నాడు. బ్రహ్మ సమాజ సంబంధాలు, సంస్కరణపట్ల గాఢమైన నిబద్దత ఆయన సహపంక్తి భోజనంలో పాల్గొనేటట్లు చేసి ఉంటాయి.

మద్రాసు సంస్కార భోజనంలో పాల్గొన్న వారి కష్టాలు తర్వాత కొద్దికాలానికే మొదలయ్యాయి. రఘునాథరావు, గణపతయ్యరు, చెంచలరావు అందరూ పెద్ద ప్రభుత్వోద్యోగులు గనుక వెంటనే స్వకులంవారి నుంచి అంతగా వ్యతిరేకత ఎదురై ఉండదు.41 సంస్కార భోజనంలో పాల్గొన్న రెండు మూడు నెలలకే రఘునాథరావు, చెంచలరావు మెత్తబడి ఒక అడుగు వెనక్కువేసి సంప్రదాయ వాదుల మెప్పు పొందడానికి ప్రయత్నించారు. రాజమండ్రిలో శంకరాచార్యులు వీరేశలింగంతోబాటు ఆత్మూరి లక్ష్మీనరసింహాన్ని వెలివేశాడు. నరసింహం శంకరాచార్యులమీద రాజమండ్రి న్యాయస్థానంలో కేసువేశాడు. కేసు శంకరాచార్యులకు అనుకూలం అయింది. తర్వాత నరసింహం మద్రాసు హైకోర్టులో అపీలు చేశాడు. రఘునాథరావు, చెంచలరావు శంకరాచార్యుల మీద హైకోర్టులో అపీలు చేయడాన్ని ఖండించి సంప్రదాయవాదుల ఆగ్రహాన్ని చల్లబరచడానికి ప్రయత్నించారు.42 మన్నవ బుచ్చయ్య, నరసయ్య ఇద్దరు తెలుగు స్మార్త బ్రాహ్మణులు. వీరి మీద చర్య తీసుకోవడానికి కంచి పీఠాధిపతికి అవకాశం ఉంది. బుచ్చయ్య అప్పుటికే 'బ్రాహ్మో' గా పరివర్తన చెందినట్లుంది. “ఆ రోజుల్లో బ్రహ్మసమాజంతో ఎటువంటి సంబంధం పెట్టుకున్నా సనాతన హిందువులు హీనంగా చూసేవారు”.43 బహుశా వీరిద్దరూ అప్రకటిత వెలికి గురి అయ్యారేమో తెలియదు.

బహిష్కరణ

సంస్కార భోజనంలో పాల్గొన్న ఏడాది తర్వాత ఈ “ఆరుగురు సంస్కర్తలను” పీఠాధిపతులు వెలివేసినట్లు 'మద్రాస్ టైమ్స్' రాసింది.44 ఈ బహిష్కరణ వెనుక ఒక సంఘటన, ఒక తక్షణ కారణం ఉంది. చెంచలరావు, రఘునాథరావుల ఆహ్వానం అంగీకరించి వీరేశలింగం ఎనిమిదవ వితంతు వివాహం మద్రాసులో జరపడానికి నిశ్చయించాడు. అయితే చివరి నిమిషంలో ఇద్దరూ వెనుకంజ వేశారు. మద్రాసు వితంతు పునర్వివాహ సమాజ సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించామని, సమావేశానికి హాజరైన