పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

35


చెప్పారు. వారిట్లా ప్రవర్తిస్తారని ఆయన ఊహకు తట్టలేదు. ప్రతి ఒక్కరూ తనలాగే మాటకు కట్టుబడి, నిర్మలమైన ఆత్మగౌరవం, వ్యక్తిత్వం కలిగి ఉంటారని, వారిమాటలు పూర్తిగా విశ్వసించవచ్చని, ఆ భోళా మనిషి, నిర్దోషి అయిన వెంకన్నశాస్త్రి నమ్మాడు. దురదృష్టవంతుడు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆయనకు ఈ విధంగా జరిగింది.

ఈ పండితుల మధ్య జరిగిన వాదం సారాంశాన్ని ఇట్లా చెప్పుకోవచ్చు.

వెంకన్నశాస్త్రి :

పత్రికా ప్రకటనలో ఇటువంటి ప్రాముఖ్యంలేని సంగతులు పేర్కొనడం అవసరం అంటారా? బహిరంగసభలకు సంబంధించిన ప్రకటనలు పత్రికల్లో ఎన్నో చూచాను. సభాధ్యక్షులెవరో, ఏ తీర్మానాలు చేయబోతారో ఇటువంటి వివరాలు నేనెన్నడూ చూడలేదు. ఇవన్నీ ఇరుపక్షాల ఆమోదంతో అక్కడికక్కడే చర్చించుకొని నిర్ణయించుకొనవలసిన అంశాలని నేను భావిస్తున్నాను.

వెంకన్నశాస్త్రి మాటలకు ఎదుటిపక్షంవారు సమాధానం చెప్పలేదు. అనంతరామశాస్త్రి ఆ కాగితం మీద చేవ్రాలు చెయ్యడానికి సిద్ధపడుతున్నట్లు అనిపించింది. ఇంతలో రంగనాథశాస్త్రి అతని చెవిలో ఏదో ఊదాడు. ఇద్దరూ వెంకన్నశాస్త్రితో ఇట్లా సంభాషించారు.

రంగనాథ శాస్త్రి :

అనంతరామశాస్త్రి : మీరు పత్రికల్లో నిందిస్తూ మా గురించి అవమానకరంగా రాశారు. ఈ అసభ్యపు రాతలవల్ల మాకు కోపం వచ్చింది.

వెంకన్న (సమాధానంగా) : మీ గురించి చెడ్డగా రాసి కోపం తెప్పించి ఉంటే, కోర్టుకు వెళ్ళవచ్చు కదా? ఇక్కడ జరుగుతున్న దానికి మీరందరూ సాక్ష్యం. (సభాసదుల వంక చూచి) వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలేవీ అనలేదని నా అంతరాత్మ చెప్తూంది. టైమ్స్ పత్రికకు నేను రాసిన మూడు లేఖల్లో వారు ప్రతిపాదించిన విషయాలకు వ్యతిరేకంగా వాదించానేకాని, వారికి వ్యతిరేకంగా కాదు. నా బుద్ధికి తట్టిన పొరపాట్లు విమర్శించాను. వారికి సమ్మతం కాకపోతే నా వాదానికి బదులెందుకు రాయలేదు? నా వాదనలను వారు తిప్పికొట్టి ఉండవచ్చు. వారిమీద నేను ఆరోపించిన 'అజ్ఞానం' మొదలైన ఆరోపణలు నామీద వారు ఆరోపించి ఉండవచ్చు.

పరిస్థితి ఇంతవరకూ వచ్చిన తర్వాత, పూజ్యులు శంకరాచార్యులు చర్చను ఆపించారు. సభాపతి, ఆ సభాస్థలి యజమాని అయిన ఆయన మొదటే హద్దూ పద్దూలేని రంగనాథశాస్త్రి ఆగ్రహాన్ని అదుపుచేసి ఉండాలి కదా ! రంగనాథం అదుపు తప్పి, ఉద్రేకంతో వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉంటే ఆయనను మందలించి ఉండాలి కదా ! వెంకన్నశాస్త్రి అంతటి పెద్దమనిషిని రంగనాథ శాస్త్రి 'ముష్టివాడు' అనే విశేషణంతో సంబోధిస్తే, ఆ ప్రవర్తనకు తగినట్లు .ఆయనను సభ నుంచి