పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

101


the Mahajana Sabha to give evidence before Lord Welby's Commission on Indian Expenditure as its own and the people's representative from this part of the country. Mr. Subramania Aiyer, though a young man is very studious and conscientious and thoroughly masters all its details before he ventures to speak or write upon any subject and he has moreover the courage of his convictions as all Southern India knows. He is by no means an impracticable man and does not allow his patriotic zeal to run away either with his discretion or common sense. So his journey to England on this public duty will, we are sure, prove beneficial to one and all in many ways".

నరసయ్య ఒక పత్రికాధిపతిగా సాటి జర్నలిస్టు సుగుణాలను హృదయపూర్వకంగా ఈ మాటల్లో వ్యక్తీకరించాడు. అయ్యరు దక్షిణ భారతదేశం నుంచి ప్రతినిధిగా వెళ్ళడం హర్షదాయకమంటూ అందుకు ఆయన అర్హతలేమిటో వివరించాడు. నరసయ్య రాజకీయ భావాలు అప్పటి దేశప్రధాన రాజీకీయ స్రవంతితోనే సాగుతున్నట్లు ఈ వీడ్కోలు వ్యాసం వల్ల స్ఫురిస్తుంది. సుబ్రహ్మణ్యఅయ్యరు మద్రాసు తిరిగి వచ్చిన తర్వాత కొద్దిరోజులకే పీపుల్స్ ఫ్రెండ్ ప్రచురణ నిలిచిపోయింది.

పీపుల్స్ ఫ్రెండ్ నరసయ్య కన్యాశుల్క నాటక సమీక్ష

గురజాడ కన్యాశుల్క నాటకం 1897 జనవరిలో అచ్చయింది. ఈ నాటకాన్ని జనవరి 21 పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో నరసయ్య సమీక్షించాడు. కన్యాశుల్క నాటకం మీద వెలువడిన తొలి సమీక్ష ఇది. సమకాలిక పత్రికలలో ఈ నాటకం మీద చాలా సమీక్షలు వెలువడ్డాయి. ఇంగ్లీషు భాష రానివారిలో కన్యాశుల్క దురాచారం కొనసాగుతూంది కనుక, అటువంటి పాఠకులకోసం ఈ నాటకం ఉద్దేశించబడిందని అముద్రిత గ్రంథ చింతామణి సంపాదకుడు పూండ్ల రామకృష్ణయ్య భావించాడు. అందువల్ల నాటకంలో వాడుక చేయబడ్డ 'గ్రామ్యోక్తుల'ను తాను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. శశిలేఖ కన్యాశుల్క నాటకాన్ని గ్రాంథిక భాషలో రాయనందుకు గర్హించింది. చింతామణి దీన్ని హాస్యరస ప్రధాన నాటకమని, “ఈ గ్రంథము నాటకరూపమున వ్రాయబడుటచే జదువరులకు హృదయ రంజకముగానే యుండ వచ్చును.” అని అభిప్రాయపడింది. గురజాడ సమకాలిక సమస్యలను స్వీకరించి, చమత్కారం, హాస్యం నింపి నాటకాన్ని రచించాడని ధీమణి భావించింది. ఇతివృత్త నిర్వహణలో నేర్పు, సహజమైన అభివ్యక్తి కన్యాశుల్క నాటకంలోని గొప్ప అంశాలని, ఈ నాటకం ప్రకృతికి అద్దం పడుతుందని వీక్‌లీ రెవ్యూ (Weekly Review) గుర్తించింది. హాస్యం పొంగులు వారే ఈ కథ నీతిదాయకమైనదని బాలిక ప్రశంసించింది. ప్రాచీన రూపకాలలో కన్పించని పాత్ర