పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

దంపూరు నరసయ్య


పార్థసారథి నాయుడుతో నరసయ్య స్నేహం చిరకాలం కొనసాగింది.

పీపుల్స్ ఫ్రెండ్ ఆరంభించిన నాటి నుంచి “ఎడిటోరియల్ నోట్సు” శీర్షిక నిర్వహించబడుతూ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ శీర్షికలో సమకాలిక సంఘటనలను వ్యాఖ్యానిస్తూ రచనలు ప్రచురించబడ్డాయి. ఇందులో అంశాలన్నీ పత్రిక సంపాదకవర్గం రాసినవే. కొన్ని అంశాల చివర "D.N." అని ప్రత్యేకంగా నరసయ్య పేరు కనిపిస్తుంది. ఎడిటోరియల్ నోట్సు వంటిదే 'Scraps' అనే మరొక శీర్షిక. 1883 సంచికలో ఈ శీర్షిక లేదు. పాఠకులకు ఆసక్తి కలిగించే చిన్నచిన్న వార్తలు అనేకం ఇందులో ఇవ్వబడ్డాయి. ఈ శీర్షికలో ప్రచురించిన కొన్ని వార్తా వ్యాఖ్యలను ఇతర పత్రికల నుంచి స్వీకరించి, ఆధారాలను పేర్కొనడం జరిగింది. కొన్ని వార్తలను పీపుల్స్ ఫ్రెండ్ స్వతంత్రంగా ప్రచురించింది. "The Week (original and selected) అని మరొక శీర్షిక ఉంది. ఈ శీర్షికలో ఫిబ్రవరి 18 శనివారం నుంచి వరసగా, రోజువారి జరిగిన ముఖ్య సంఘటనలు ప్రచురించబడ్డాయి. ఈ శీర్షికలోనూ ఇతర పత్రికలనుంచి వార్తలు స్వీకరించినపుడు ఆయా పత్రికల పేర్లు వార్తల కింద ఇవ్వబడ్డాయి. 'గెజిటు' శీర్షికలో ఫోర్టు సెంట్ జార్జి గెజిటు నుంచి అనేక విషయాలు యథాతథంగా ప్రచురించబడ్డాయి. "Telegrams selected from daily papers" శీర్షికలో ప్రపంచ వార్తలు ఆయా పత్రికల నుంచి పునర్ముద్రించబడ్డాయి. ఈ శీర్షికలో కొన్ని వార్తల చివర ఆకరాలు కనిపించవు.

హోల్కరు వ్యవహారం

ఎడిటోరియల్ నోట్సు శీర్షికలో అప్రతిష్ఠపాలైన హోల్కరు .మహారాజు వ్యవహారం నరసయ్యే స్వయంగా రాశాడు. ఈ సంస్థానాధిపతి దుర్వ్యసనాలకు, దుష్ట సహవాసాలకు అలవాటు పడినట్లు, అతని ప్రవర్తనకు 'గ్రహచారం' కారణమని జోస్యులు చెప్పిన కారణాన్ని నరసయ్య తిరస్కరించాడు. "We fear the astrology of women's starry eyes is doing much mischief to his moral, mental, spiritual and political state" అని వ్యంగ్యంగా రాశాడు. మహారాజుకు జాతకాలమీద, జోస్యులమీద విశ్వాసం ఉందని, అందుకు అతనిని ఏమీ అనలేమని, “సూర్యచంద్ర నక్షత్రాల ప్రభావం మనుషుల హృదయాలమీద ఉండదని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము” అని ఈ సందర్భంలో వ్యాఖ్యానించాడు. "Was it from experience that there is a devil in the moon for mischief" అనే బైరన్‌కవి చరణాలను ఉదాహరించి, "If so why not in the stars? There is doubtless a great deal of naughtiness, especially under bright Italian starry skys, and perhaps under Indian starry skies too" అని పరిహసించాడు . "Thousands are guided by Zodiacal Almanac, and that less pretty closely predicted events, at least some. The Maharajah only