పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

95


నిధులు సమకూర్చుకోడానికి ఇదొక్కటే మార్గంకాదు, ఇతర మార్గాలూ ఉన్నాయి. రాష్ట్రాలకు కేటాయించే నిధులు ఎందుకు తగ్గించ కూడదు? పెద్దమొత్తంలో జీతాలు తీసుకొనే ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో ఎందుకు కోత విధించకూడదు? కొరగాని ఆడంబరాలకోసం ఎంతధనం దండుగ చేస్తున్నారు? నిధుల లోటు గురించిన పెడబొబ్బల మధ్య, ప్రతిదానికీ అడ్డుపడే ఆ నిరర్థక గవర్నరు (పదవీ విరమణ చేసిన) తన అనుచరగణం విలాసాలకోసం ఊటీలో ఎన్ని లక్షలు కర్చుచేశాడు? కనీసం ఆయనను మందలించారా? వెర్రి ఆడంబరాలకోసం కర్చు పెట్టిన ధనాన్ని తిరిగి చెల్లించమని నిర్బంధ పెట్టారా? అదేమి లేదు (.....) మిలో సేవా దృక్పథం, దేశభక్తి ఉంటే ఏటా నూరో ఇన్నూరో చందా వేసుకొని దేశ ఆర్థిక వనరులకు ఎందుకు తోడ్పడకూడదు? నిరుపేదలు జీవించడానికి అవసరమైన ఆహారపదార్ధం మీద, జంతువులు బ్రతకడానికి అత్యవసరమైన దినుసుమీద పన్ను విధించడం అవసరమంటారా? ఇందుకు “ప్రభుత్వ అవసరాలను” సాకుగా చూపుతున్నారు. పెద్దమొత్తంలో జీతాలు తీసుకొనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో ఎందుకు తాత్కాలికంగా కోతపెట్టకూడదు?”

నరసయ్య ప్రజల సమస్యలమీద ఎంత తీవ్రంగా రాసేవాడో, లభించిన ఈ అయిదారు సంపాదకీయాలవల్ల స్పష్టమవుతూంది. “ఒక మద్రాసు గవర్నరుకు ఇంగ్లీషు రాదని” నరసయ్య తన పత్రికలో వివాదం లేవదీసినట్లు తెలుస్తూంది. ఆయన రాతలలో కనిపించే తీవ్రత, చురుకు వల్ల ప్రభుత్వోద్యోగులు, పెద్దపెద్ద అధికారులు పత్రికమీద ద్వేషాన్ని పెంచుకొని ఉంటారు. ఈ సంపాదకీయాలు చదివే, బంగోరె నార్లకు రాసిన ఉత్తరంలో “... ఈ రోజు అనుకోకుండా మద్రాసు ఆర్కైవ్స్‌లో పర్మిషన్ లభించింది. ఎన్నాళ్ళనుంచో నేను తపిస్తూ వచ్చిన మా నెల్లూరు జర్నలిజం జనకుడు దంపూరు నరసయ్య edit చేసిన People's Friend పత్రిక సంచికలు రెండింటిని కళ్ళారా చూచే భాగ్యం లభించింది. వాటిలో కొన్ని ముఖ్య Editorial items చదివిన మీదట దంపూరు నరసయ్య నిస్సందేహంగా గొప్ప జర్నలిస్టనే అభిప్రాయం సాక్ష్యాధారాలతో సహా నేడు మరింత ధృవపడిందే తప్ప, అది తగ్గలేదు” అని అభిప్రాయ పడ్డాడు.

1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ - కొన్ని విశేషాలు

ఈ సంచికలో ఆంధ్ర ప్రకాశిక వారపత్రిక మిద ఒక సమీక్ష ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీలో సక్రమంగా వెలువడుతున్న తెలుగు వారపత్రిక అని, ఇంగ్లీషు వారపత్రికల పద్దతిలో దీన్ని ప్రచురిస్తున్నారని ప్రశంస ఉంది. సమర్థతతో రాయబడ్డ రచనలతో, పత్రిక పాఠకాదరణ పొందిందని, ఇంగ్లీషు రాని పాఠకులు ఈ పత్రిక ద్వారా దేశపరిస్థితులను, రాజకీయాలను చక్కగా గ్రహించవచ్చని, పాఠకులకు ఆసక్తి కలిగించే ఎన్నో విశేషాలు ఈ పత్రికలో ఉన్నాయని ఇందులో ఉంది. ఆంధ్ర ప్రకాశిక ప్రకాశకుడు ఏ.సి.