పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

97


follows suit. When Doctor Johnson believed in the Cock lane Ghost what harm if a Maharajah who never composed a Dictionary or the "Wanity of human wishes" should place faith in astrologers! We trust that the Stars will be generous to Holker and remove the disfavour against him." అని నరసయ్య ఈ వ్యాఖ్యను ముగించాడు. మూఢనమ్మకాలను తొలగించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని వ్యాపింప చెయ్యడానికి, ఏరాయయినా పనికివస్తుందని ఆయన భావించినట్లు ఇందువల్ల తెలుస్తుంది. 'స్క్రాప్స్' శీర్షికలో ట్రావెన్కూరు మహారాజా దేశాటనలో కాలం వెళ్ళబుచ్చుతున్నాడని, ఈ సంస్థానం పరిపాలన పట్టించుకొనే నాథుడే లేడని, ఈ సంస్థానం గురించి ఎవరూ ఒక్క మంచిమాట చెప్పడం లేదని, ప్రభుత్వం పరిస్థితి గమనిస్తూ ఉందని వివరించబడింది. ఈ సంచికలోనే "The illegitimacy of Maharajah Duleep Singh" అనే వ్యాసం ట్రిబ్యూన్ (Tribune) పత్రిక నుంచి పునర్ముద్రించబడింది. నరసయ్యకు స్వదేశీ సంస్థానాధిపతుల మీద, జమీందారుల మీద అప్పటికే సదభిప్రాయం లేనట్లు అనిపిస్తుంది.

ఈ సంచికలో "Suit in connection with municipal law, Physical training in India, The Agricultural college at Delhi, The races of India, A Royal romance, Railway train telegraphs" మొదలైన వ్యాసాలు ఇతర పత్రికల నుంచి పునర్ముద్రణ పొందాయి.

ఎడిటోరియల్ నోట్సు శీర్షికలో పిచ్చికుక్క కాటుకు వైద్యం లేదని, ఈ రోగ నివారణకు మందు కనిపెట్టి మానవాళిని కాపాడాలని ఒక వార్త ఉంది. రైల్వే ట్రైన్ టెలిగ్రాఫ్స్ వ్యాసంలో నూతన శాస్త్ర ఆవిష్కరణలు రైలు ప్రమాదాలను నివారించగలవనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఈ శీర్షికలోనే బెంగాల్ పరగణాలో ఉప్పు ధర పెరిగినట్లు ఒక వార్త కనిపిస్తుంది.

రెండు కవితలు

ఈ సంచికలో ఈగల, దోమల బాధను వివరిస్తూ హాస్యకవిత ఒకటి ప్రచురించబడింది. వార్తలు స్పష్టంగా, సంగ్రహంగా, ఆసక్తికరంగా రాసే పద్ధతులు ఒక కవితారూపంలో వివరించబడ్డాయి.

Whatever you have to say my friend
Whether witty, or grave or gay
Condense as much as ever you can,
And whether you write on rural affairs