పుట:Dvipada-basavapuraanamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11

—: నారదుఁడు కైలాసమున కేఁగుట :—


నారదుం డను మునినాయకోత్తముఁడు
భూరిసర్వాంగముల్ భువిఁ బొంద మ్రొక్కి
ముకుళితహస్తుఁ డై మొక్కుచు మఱియు
సకలలోకాలోక చరితంబులెల్ల
విన్నవింపఁగ నున్న కన్నెర్గి శివుఁడు
వెన్నెలఁగలకంట వీక్షింపుచున్న
యవసరోచితమున నంబికాదేవి
శివుననుమతమునఁ జేసన్నఁ బిలిచి 280
“పోయివచ్చినకార్యములు విన్నపంబు
సేయు మీ వున్నట్లు శివునకు" ననిన
నమ్మునీశ్వరుఁడు మహాలింగదేవు
సమ్ముఖుఁ డై కరాబ్జమ్ములు మొగిచి

—: నారదుఁడు శివునకు భూలోకవృత్తాంత మెఱిఁగించుట :—


“సకలలోకాలోకచరితంబు లెల్లఁ
బ్రకటితభక్తి నేప్పటియట్ల పరఁగు
నరలోకమున నుమానాథ ! మీభ క్తి
చరిత మేమియును విస్పష్టంబు గాదు.
తవిలి శివాచారతత్పరు లగుట
భవులతోఁ గొందఱు పలుక కున్నారు ; 290
లోక ప్రపంచంబులోఁ గొంద ఱుండి
లోకబోధకు లోను గాకున్న వారు ;
మఱికొంద ఱానందమగ్ను లై తమ్ము
మఱచి లోకములకు మఱపడ్డవారు ;
ఉన్నతసద్భక్తియుక్తు లై కొంద
ఱున్నారు తమతమయొడళులు డాఁచి;
యిది కారణము గాఁగ నీశ ! మీభక్తి
తుద మొద లిది యనఁ దోఁప దెవ్వరికి ;