పుట:Dvipada-basavapuraanamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

9

భక్తుఁ డై లింగంబు ప్రకృతి సేకొన్న
వ్యక్తిగా బసవన్న వరవుఁడు సేయుఁ ;
బరమాత్మరూప మాబసవఁడే యెఱుఁగు :
బరమేశుఁ డెఱుఁగు నాబసవనీయనువు :
సాలోక్యసామీప్యసారూప్యపదవు
లోలిని బొంద సాయుజ్యంబుఁ జెంద
వచ్చుఁ గా కిల బసవస్వామి గాఁగ
వచ్చునే పెఱపెఱవారల కెల్లఁ ?
బ్రమథాగ్రగణ్యుండు బసవఁ డీశునకు;
సమశీలభక్తుండు జంగమంబులకు,
లింగదేవునకు ననుంగు బసవఁడు ,
జంగమకోటికి సడిసన్నదాసి, 230
యెక్కంగ వాహనం బెప్పు డీశ్వరున,
కెక్క సింహాసనం బీశుభకులకుఁ .
గాలకంధరు కరవాలు బసవఁడు;
శీలంబు భక్తులచేతి యద్దంబు ;
బసవని నెవరికొఁ బ్రస్తుతి సేయ !
వసమె యెవ్వరికైన బసవని నెఱుఁగ :
సంపన్నుఁ డై లింగజంగమంబులను
బొంపిరిగొని పువ్వుఁగంపునై యుండుఁ
గావున బసవని గణుతింపరామి
దేవాసురుల కైనఁ దెల్ల మై యుండు ; 240
నెన్నంగ [1] వేడ్కకాఁ డెఱుఁగునే దోస
మన్నట్లు గాక యాహపణి గీర్తింప
నిదియుఁ గోటికిఁ బడ గెత్తినవానిఁ
బది వలకాఁప వై బ్రదుకు మన్నట్టు
లాపరంజ్యోతి స్స్వరూపంబునకును
దీపకంభంబు లెత్తించినయట్లు

  1. విటుఁడు.