పుట:Dvipada-basavapuraanamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

5

“బసవపురాణంబు' బసరించుశ క్తి
ననలార నొసఁగితి మటు గావునను
రచియింపు బనవపురాణంబు నీవు
నచలితభక్తహితార్థంబుగాఁగ"
నావుడు.-భక్తజనావలియాజ్ఞ
వావిరిఁ దల మోచి వర్ణింతుఁ గవిత :
పాటింపఁ దగిన కర్ణాటభూమికిని
గోటీర మై యొప్పు గొబ్బూ రనంగ 110
నాయ గ్రహారమహాజనో త్తమని
కాయపూజితపాదకమలద్వయుండు
శాంభవ వేధదీక్షాసద్విశేష
సంభావితా శ్రితజనసముత్కరుఁడు
సురుచిర ప్రణవవిస్ఫురితోపదేశ
చరితార్థ నిఖిలశిష్య ప్రతానుండు
కింకరనిచయహృత్పంకేరుహాంత
రాంకిత వరసచ్చిదానందమూర్తి
పాత్రుండు భవలతాదాత్రుండు విషయ
జై త్రుండు విమల చరిత్రుండు సకల 120
భువనపావనమూ ర్తి బుధచక్రవర్తి
ప్రవిమలకీర్తి సద్భక్తిప్రపూర్తి
యని వినుతింపగ నాచార్యమహిమ
మనుచుండు మండెఁగ మాదిరా జనఁగ;
నామహాత్ముని సముద్యత్కృపాపూరి
తామృతహస్తకృతావతారుండు
నా గురుదేవు పాదాబ్జ సౌరభ్య
భోగలీలా వరపుష్పంధయుండు
నాశివయోగి యుదాత్తమూర్తి ప్ర
కాశితహృత్పద్మ కర్ణికాంతరుఁడు 130
నాదివ్యదేహు దయాకలితప్ర