పుట:Dvipada-basavapuraanamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

బసవపురాణము

మహిఁ జను రెంటాల మల్లినాథుఁడును ;
నిరతిశయప్రీతి నిత్యంబు నైదు
కరవీరపుష్పముల్ హరున కర్పింప
నొక్కనాఁ డొక పువు తక్కువ యైన
గ్రక్కున దననేత్రకమల మర్పించి
భవునిచే నసదృశంబవు కన్ను వడసి
ధ్రువకీర్తిఁ బేర్కొన్న దోచమాంబయును ; 80
ధీరుండు మున్నయదేవయోగీశు
కూరిమిశిష్యుండు నారయాంకునకుఁ
బుత్త్రుండుఁ బరమపవిత్రుండు విమల
గాత్రాంచితుఁడు నీలకంఠాగ్రజుండు
జగదభినుతుఁడు ప్రసాదావధాని
నిగమార్ధవేత్త గోడగి త్రిపురారి ;
లోనుగా సకలభక్తానీక మెలమి
మానితభక్తిసామ్రాజ్యసంపదలు
సిలివిలి వోవంగఁ జిరతరమహిమ
నలరారుచుండంగ నం దొక్కనాఁడు 90
మండితాసంధ్యాతమాహేశ్వరులకు
దండప్రణామంబు దగ నాచరించి,
భక్తదయారసపరమామృతాభి
షిక్తుండ నగుచు గోష్ఠీ ప్రసంగతిని
“నసదృశం బై యొప్పు బసవపురాణ
మెసకంబుతోఁ జెప్ప నిష్ట మయ్యెడును
వరకథాసూత్రంబువెర వెఱిఁగించి
చరితార్థుఁ జేయరే కరుణతో " ననుచు
సన్నుతిసేయుచు సస్పృహత్వమున
విన్నవించుఁడు, భక్తవితతి హర్షించి 100
సముదితప్రీతిఁ బ్రసాదావలోక
నము నివ్వటిల్లంగ నన్ను వీక్షించి