పుట:Dvipada-basavapuraanamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxii

చున్నది. మొదటి ప్రతాపరుద్రుని (క్రీ. శ. 1185_1195) కాలమున నున్నవాఁడనువారు పై కథలోని ప్రతాపరుద్రనామ సంబంధము తప్ప నితరాంశముల నన్నింటిని ప్రమాణములుగా గ్రహింపరు. పాల్కురికి సోమనాథునకును పిడుపర్తి సోమనాథునకును కాలాంతర మధిక మగుటచే నీతని మాటలలో సత్యదూరము లైన పుక్కిడిపురాణములు చేరియుండవచ్చు నని భావించి పాల్కురికి వాని గ్రంథాంతర సాక్ష్యములు. అతని సమకాలీనుల రచనలు, కర్ణాట కవి చరిత్రకారుల రచనలు మొదలగువానిని ప్రధానసాక్ష్యములుగా గైకొని కాలనిర్ణయము చేసెదరు. రెండవపక్షమువారు ప్రతాపునికాలమందును(క్రీ. శ .1295_1326) పిడుపర్తి సోమనాథుని వాక్యము లందును ప్రమాణబుద్ధి నుంచి సోమనాథుని కావ్యాంతర సాక్ష్యములను , ఇందుటూరి అన్నయామాత్యుఁడు డోకుపఱ్ఱు దాన మిప్పించిన వృత్తాంతమును సమన్వయించి కాలనిర్ణయము చేసేదరు.

మొదటి పక్షమువారి ప్రధాన వాద ప్రమాణములలో నొకటి సోమరాజును కర్ణాట కవి రచించిన యుద్భట కావ్యమునఁ బేర్కొనఁ బడిన యీ క్రింది పద్యము.

ప్రమథానీకకథార్ణవేందు హరిదేవాచార్యనం ధైర్యనం
సముదంచద్వృషభస్త వామర మహీజారామనం సోమనం
విమలజ్ఞాన సుదీపికాస్ఫురితచేతస్సద్మనం పద్మనం
క్రమదిందం బలగొండు పేళ్వెనొసెదా నీ కావ్యమం సేవ్యమం.

ఇందు వృషభస్తవ మొనర్చిన కవిగా స్తుతింపబఁడిన సోమనయే పాల్కురికి సోమనాథుఁ డని వీరి విశ్వాసము. సోమరాజకవి తన రచనా కాలము నీ క్రింది విధముగాఁ బేర్కొనినాఁడు.

మ. జననాథోత్తమ సోమరా జను సిర్దీ కావ్యం పలం శాలివా
     హన శాఖాబ్దమదెయ్దె సాసి రదనూఱిం సంద నాల్వత్తు నా
     ల్కనె యారంజిత చిత్రభానువ వరాశ్విజోల్సి తై కాదశీ
     వనజారాతితనూజవాసర దొ ళాదత్తల్ల మంగర్పితం.

ఇందలి “నూఱింసందనాల్వత్తు నాల్కనె" అను మాటలను బట్టి సోమరాజుకవి శ. 1144 (క్రీ.శ. 1222) సం. ప్రాంతమువాఁ డని తెలియుచున్నది. కావున నతనిచేఁ బ్రశంసింపఁబడిన సోమనాథుఁడు నంతకుఁ బూర్వమే బసవ పురాణము రచించియుండనోపు నని భావించిరి, కాని నూఱిన్ సంద" అనుపాఠ