పుట:Dvipada-basavapuraanamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxi

ముందు కడుగువేయ వయ్యెను. సోమనాథుఁ డది యెఱింగి లక్ష్మిని ‘తొలఁగు' మని యానతిచ్చెను. అంత నా విగ్రహము తునియ లై నేలఁబడెను. ప్రతాపుఁ డది యెఱింగి భయపడి విప్రులతోఁ గూడివచ్చి సోమనాథునికి మ్రొక్కెను. అతఁడు వారలను దయాదృష్టితోఁ గాంచి, శివభక్తుల సమాదరణము పొంది యచ్చట కొన్నిదినము లుండెను. అంత త్రికాలవేది యగు సోమనాథుఁడు పిడుపర్తి శివరాత్రికొప్పయ్య మొదలగు శివభక్తులను జేరఁబిలిచి “ఈ దేశం బింకఁ దురుష్కులచే నాక్రాంతము గాఁగలదు; మాబోటి మతస్థులకిం దువికి పొందువడదని చెప్పించి," ప్రతాపుని మంత్రియు తనశిష్యుఁడు నైన ఇందుటూరి అన్న యను బిలువఁబంచి, శివమతస్థులకు డోకిపఱ్ఱుగ్రామము నగ్రహారముగా నిప్పించెను. అందు భక్తులతోఁగూడి కొన్నాళ్లు సోమనాథుఁడుండి, వార్థకము గదియ వచ్చె ననియు, సమాధిగతుఁడు కావలె ననియు తలంచి కల్కెమనుపురి కేఁగి, అందు విభూతితో నింపిన గర్తమున సమాధిగతుఁ డై, భక్తులు చూచుచుండ ప్రత్యక్ష శివాకృతిలో లింగైక్య మందెను. [1]

కాలము :

పాల్కురికి సోమనాథకవి ప్రథమ ప్రతాపరుద్రుని కాలమున నున్న వాఁడని కొందఱును , [2] రెండవ ప్రతాపరుద్రుని కాలమున నున్నాడని కొందఱును [3] భావించుచున్నారు. ఇట్లు భావించుటకు పైనఁ బేర్కొనఁబడిన యైతిహ్యమునఁ గల ప్రతాపప్రశంసయే ముఖ్యకారణము. ఒక విధముగా సోమనాథుని కాలవాదచక్రము ప్రతాపరుద్రుఁడను కేంద్రము నాధారముగాఁ గొని పరిభ్రమించు

  1. చూడు: పిడుపర్తి సోమనాథుని పద్య బసవపురాణము. పీఠిక ప. 28-46, పాల్కురికి సోమేశ్వర పురాణాదులలో నున్నకథలను గూర్చి కీ. శే. వే. ప్రభాకర శాస్త్రులవారి పీఠికలో పు. 22-26, చూచుకొనునది.
  2. క్రీ. శ. 1190 ప్రాంతము వాఁడని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు; 1190-1260 -70 నడుమ నున్నవాఁడని నిడుదవోలు వేంకటరావుగారు, 1160-1240 నడుమ నుండె నని బండారు తమ్మయ్యగారు :
  3. బసవపురాణ, పండితారాధ్య చరిత్రల రచనాకాలము క్రీ. శ. 1-90-1320 మధ్య నుండునని మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ; 1240 తరువాతి వాఁడని చిలుకూరి నారాయణరావుగారు; క్రీ. శ. 1240 - 1320 నడిమివాడని చాగంటి శేషయ్య గారు,