పుట:Dvipada-basavapuraanamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxx

క. “బసవేశ్వర ముఖ్య ప్రమథ
    వ్రనృమర మాహాత్మ్యయుక్త బసవపురాణ
    ద్యసమ శ్రీగంథ నిబం
    ధ సమంజస వాగ్విలాస ! నవ్యవ్యాసా !” [1]

అని పిడుపర్తి సోమనాథుఁడు కీర్తించియుండుట దానికి సాక్ష్యము, అంతియకాదు. సోమనాథుఁడు "పరమతనిర్దూమధామ భాసురపతి" యనియు, వాదిజైత్రాగ్రగణ్యుఁడనియు “సారవీరవ్రతాచార పారంగతు:"డనియు చతుర్నిగమసారవాక్సరణియుక్త సత్కావ్యనిర్మిత ప్రణవశిష్యకామిత విశిష్టముక్తి ప్రదుఁ" డనియు, రసనాగ్రస్థానకృత్యత్ప్రవిమల శివశాస్త్రస్థితాశేష గోప్యార్థ ... వచన సంధాన నైపుణ్య' భాసితుం డనియు, 'యతి' యనియు, 'సుజ్ఞాని' యనియు, 'సమహిత మహిమాడ్యుఁ' డనియుఁ గీర్తింపఁబడెను.[2] పిడుపర్తి సోమనాథుఁడు పాల్కురికి సోమనాథుని కవిత్వమహిమను, శివవ్రతాచార మహిమను వికాసక్రమమున నాశ్వాసాద్యంత పద్యములందు వర్ణించి యాతని పరిపూర్ణజ్ఞాన స్వరూపమును సప్తమాశ్వాసమున “పరిపూర్ణానందమూర్తి! భరిత దశదిశా ప్రాంత విశ్రాంతకీర్తీ :”[3] అని సంబోధించుటలో వ్యంజించెను.

ఇట్టి మహనీయవ్యక్తి యొక్క మహిమలు తెలుపు నద్భుతకథ లనేకము లున్నవి. అవియన్నియుఁ జరిత్రకారులు నమ్మకపోయినను అతని కాలనిర్ణయమున కుపకరించు పూర్వోక్తైతిహ్యమును మాత్రము విశ్వసించుచున్నారు. అట్లు విప్రుని వాక్యములు విని యచ్చటి శివభక్తులు చెవులను చేతులతో మూసికొని యా బాపని వధింప నుంకించియుఁ బాల్కురికిలో నున్న సోమనాథున కెఱిగింప నేఁగిరి. సోమనాథుఁడు వారి మాటలు విని భవులతో వాదము చేసి గెలువఁదలంచి, భవిదర్శన వివర్జన దీక్షితుఁడుగాన తృణ మానవునితో వాదు గెలిపింతు నని ప్రతిజ్ఞచేసి, లింగముద్రలుగల యెడ్లు పూన్చిన గుడారుబండి నెక్కి యోరుగల్లుకు పయన మయ్యెను. అతనిరాక నోరుగల్లులోని భవు లెఱింగి యల్లరిమూకకు లింగముద్రలు తగిలించి యతని కెదురు పంపిరి. వారు సోమేశ్వరుని కెదురేగి మ్రొక్కునంతనే యతని మహిమవలన వారు ధరించియున్న కృతకలింగ

చిహ్నములు సహజములై పోయెను. అంత నా రామహిమ కచ్చెరువంది సోమనాథుని శిష్యులై పోయిరి. ఇట్లు మహిమలు ప్రదర్శించుచు నోరుగంటి కోట వాకిటఁ బ్రవేశించు నవసరమున గవనిపై గజలక్ష్మి విగ్రహము గాంచి యెడ్లు

  1. పిడుపర్తి సోమన బ. పు. 1. 156.
  2. పిడుపర్తి సోమన బసవపురాణము పీ. 79. 4. 322; 2.213, 3.452; 4.320; పీ. 79. 82; 6.373;
  3. పి. సో. బ. పు. 7. 383.