పుట:Dvipada-basavapuraanamu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

బసవపురాణము

సద్గురుకారుణ్య సంగతిఁ బుట్టి
సద్గురుకారుణ్య సంపదఁ దనరి
సద్గురుగర్భవిశ్రాంతిమై నిపుడు
తద్గతుఁ డై లింగతత్త్వంబుఁ బొందె ; 890
నట్టిదకాదె గుర్వంఘ్రియుగంబు
ముట్టఁగఁ గొల్చినయట్టి భక్తాలి
హృదయాంబుజంబుల నీబసవయ్య
కదలక పువ్వును గంపునుబోలె
నలి నున్నవాఁడుగా కిలవేరు గలదె ?
మలహరుభక్తులఁ గలకాల మెల్ల
భక్తహితార్థమై ప్రభవించెఁగాక
వ్యక్తిగా నతఁ డీశ్వరాంశంబ కాఁడె' ?
యని నుతింపుచుఁ దొంటియట్ల సద్భక్తి
జనితసుఖామృత వనధిమధ్యమున 900
నోలలాడుచు నుండి, రురుతరానంద
లీనమై నటు గొంతగాల మింపారఁ
బ్రస్తుతింపంగ సద్భక్తి విస్ఫురణఁ
బ్రస్తుతి కెక్కిన బసవని చరితఁ
జెప్పితి భక్తులచే విన్నమాడ్కిఁ
దప్పకుండఁగను యథాశ క్తిఁ జేసి :
యిమ్మహి నీశున కెఱుఁగంగ రాని
యమ్మహాబసవని యద్భుతచరిత
వర్ణింప నెంతటివాఁడ? నట్లయ్యు
వర్ణనచేసితి వారిన కాని
యేయెడ నన్యధా యెఱుఁగ నే ననెడి 910
యీ యొక్కబలిమి మహిష్టతకలిమి :
నదియునుగాక మహాభక్తవరుల
సదమలదివ్యప్రశంసగాఁజేసి
భావించి నాదు వాక్పావనార్థంబు