పుట:Dvipada-basavapuraanamu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

257

తత్పరుఁ డై యున్నఁ వనయు లే నెత్తి
చక్కన తనదు ప్రసాదంబు పెట్టి
యక్కున నందంద యప్పళించుచును 860
గొడుకు లోపలఁ జేర్చికొని గురుమూర్తి
గుడి సొచ్చె ; నిరువురపొడ గానరాదు ;
పసగొని సకలభక్తసమూహి సూడ
బసవయ్య గురువుగర్భంబు సొచ్చుటకు
సంగయదేవుండు సద్గురుభాతి
భంగిగా నేతెంచి బసవయ్య నిట్టు
తనయందు సంధించికొనుటకు నంత
ఘనతరలీల జంగమకోటి యలర
నరుదగు లింగతూర్యంబులు మ్రోయ
ధరఁ బుష్పవృష్టి దాఁ బరిగొని కురియఁ 870
గో యని భక్తనికాయ మెల్లెడల
గేయని బలుమాఱుఁ గీర్తనసేయ
జయజయారవములు సందడింపంగఁ
గ్రియఁగొని వినుకులుఁ గేళిక ల్దనర
మాదిరాజయ్యయు మాచిదేవుండు
నాదిగాఁ గలభక్తు లనురాగలీలఁ
‘గలపె యుత్పత్తిస్థితిలయ ప్రపంచ
ములు బసవయ్యకుఁ దలఁచిచూడంగ !
గాలిలోపల సురగాలినాఁ బుట్టి
గాలిలోనన వెండి గలసినయట్లు,
శరనిధిఁ గడలునా జనియించి వెండి 880
శరనిధిలోనన సమసిన యట్లు,
ఉడువీథియందు విద్యుల్లత వుట్టి
యుడువీథియందుఁ దానడఁగినయట్లు.
జలములయందు వర్షాఫలం బమరి
జలములలోనన సమసినయట్లు,