పుట:Dvipada-basavapuraanamu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

259

గావింప మేటి యీ కథ రచించితిని.
బసవపురాణంబుఁ బాటించి వినిన
నసలారుఁబో ప్రసాదానందసిద్ధి :
బసవపురాణంబుఁ బాటించి వినిన
వసియించు సద్భక్తి వాసనమహిమ ; 920
బసవపురాణంబుఁ బాటించి వినినఁ
బసిగమైఁ బ్రాపించు భక్తులకరుణ ;
బసవపురాణంబుఁ బాటించి వినినఁ
బసరించు లింగానుభవ నిత్యసుఖము ;
బసవపురాణంబు బాటించి వినిన
నెసకంబుతోఁ గల్గు నీప్సితార్థములు :
బసవపురాణంబు భక్తి వ్రాయించి
వసదిగాఁ జదివెడువారల కెల్ల
దురితము లాపదల్ ద్రోహంబులెల్ల
హరియించు నెంతయు హరుకృపఁజేసి ; 930
యీ పురాణం బెవ్వరేఁ దమయింట
నేపార నిడికొన్న నిహపరసిద్ధి.
శరణోపకార బసవపురాణార్థ
విరచిత త్రిభువన విఖ్యాత చరిత !
శరణోపకార బసవపురాణార్థ
వరభు క్తిముక్తి సంవర్ధనభరిత :
శరణోపకార బసవపురాణార్థ
సరససమంచిత సత్యవాగ్జాల !
గొబ్బూరి మాదన్న కూరిమి శిష్య !
గొబ్బూరిసంగ : సద్గుణ సముత్తుంగ ! 940
ఇది యసంఖ్యాత మహేశ్వర దివ్య
పదపద్మసౌరభభ్రమరాయమాణ
జంగమలింగ ప్రసాదోపభోగ
సంగతసుఖసుధాశరధినిమగ్న