పుట:Dvipada-basavapuraanamu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

బసవపురాణము

మడరఁ బ్రసన్నుఁ డయ్యెడి శివుఁడప్డు :
ఈ నిర్ణయమునకు నీశానగణ వి
తాన మెంతయు మెచ్చి తత్ప్రస్తవంబు
నిమ్ములఁ గరుణించి యిచ్చిరి నీకు ;
నమ్ము ముమ్మాటికి , లెమ్ము ! లె ! " మ్మనుడు 660
నంగద మోడ్పుఁగే లలికంబుఁజేర్చి
పొంగుచు వీరతాంబూలంబు గొనుడు
జగదేవశరణుని నగరికి బసవఁ
డగణిత భక్తసహాయుఁ డై యరిగె:
నసలార నుచితిక్రియాదులఁ దనిసి
బసవన్న యసమసద్భక్తులుఁ దాను
ననయంబు భక్తిసుధామృతాపార
వనధి నిమగ్నుఁడై వర్తింపుచుండె.

—: అల్లయ్య మధుపయ్యల కథ :—


మఱియంత నల్లయ్య మధుపయ్య యనఁగఁ
గఱకంఠుభక్తు లకర్మసంచయులు 670
లింగైకనిష్ఠావిలీనమానసులు
జంగమారాధనాస క్తచేతసులు
పరమశివాచారపరవర్త్మనిరతు
లురుతురకీర్తి నియుక్తులు నాఁగ
నసమానలీలఁ గళ్యాణంబునందు
బసవఁడు తారు నప్పాట వర్తింప
నంత బిజ్జలుఁడు దాఁ గొంతకాలమున
కంతకు ప్రోలికి నరుగంగఁ దలఁచి
బసపని బహిమయు భక్తిమహత్త్వ 680
మెసకంబు నెఱిఁగియు నెఱుఁగని యట్లు
పొదలిన యజ్ఞానబోధగాఁ జేసి
మదియించి మల్లయ్య మధుపయ్యగారి
తప్పేమియును లేక చొప్పుగా దనక
రప్పించి కన్నులు వుప్పించె. నంత :