పుట:Dvipada-basavapuraanamu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

251

'కాలకాలునిభక్తగణములమహిమ
లేల తా మున్నును నెఱుఁగును గాదె !
యక్కట ! చెడఁజూచె నవనీశుఁ డింక
నిక్కటకంబున కెక్కడి బ్రదుకు ?
మృడుభక్తు లలిగినఁ జెడఁడె తా' ననుచు
జడిగొని నరులెల్ల బుడిబుళ్ళువోవ 690
బసవఁడు మొదలుగా నసమాక్షుభక్తు
లసమకోపోద్దీపితాంగు లై పొంగి
మసలక మల్లయ్య మధుపయ్యగారి
కసలారఁగా గన్ను లప్పుడ పడసి
'యింక నుండఁగఁగూడ దీయూర' ననుచు
శంకరభక్తులు జగదేవమంత్రిఁ
'బనిచిన తొల్లింటి బాస గైకొనుము
తునుము శివద్రోహి' ననుచు బిజ్జలుని
నొసలిరేఖలు గసిబిసిచేసి రాజ్య
మసమాక్షుకవిలియ నటు దుడిపించి 700
బల్లహుకటకంబు వదటిపా ల్సేసి
యెల్లవారును జూడ నీక్షణంబునను
'బాడగుఁ గటకంబు వాడగుఁ గూడఁ
బాడగు' ననుచు శాపంబు లిచ్చుచును
రాచినమడివాలుమాచయ్యగారు
నాచౌడరాయఁ డేకాంతరామయ్య
కిన్నర బ్రహ్మయ్య గేశిరాజయ్య
కన్నదబ్రహ్మయ్య గక్కయ్యగారు
మాదిరాజయ్యయు మసణయ్యగారు
నాదిగా నప్పురి యఖిలభక్తులును 710
దండిజంగమకోటి దనతోడ నడవ
బండారిబసవనదండనాయకుఁడు
నెసఁగఁ గప్పటిసంగమేశ్వరంబు నకు