పుట:Dvipada-basavapuraanamu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

249

నొండేమి యిలఁ గూడియున్న యంతటను
చండాలమిశ్రదోషంబు వాటిల్లు ;
“దర్శనా దపి పాపదా” యనుఁ గాన
దర్శనాలాప సంస్పర్శన శయన 630
సంపర్కబోజనాసన దానములకు
నింపారునే భక్తుఁ డితరులయెడను ?*
“వేదజ్జు లగు కోటివిప్రుల కన్న
మాదటఁ బెట్టిన యట్టిఫలంబు
త్ర్యక్షభక్తున కొక్క భిక్షంబుపెట్టు
నక్షయఫలమున కసమాన మనుట
వ్యకమై యుండఁ గుయుక్తుల నడవ
భక్తియుఁ జెడు ! దానఫలము నిష్ఫలము '
అని పెక్కు భంగుల నాన తిచ్చుడును
విని శోకజలసమన్వితనేత్రుఁ డగుచు 640
జగదేవుఁ డాభక్తజననికాయంబు
మొగిఁ బ్రస్తుతింపుచు మోడ్పుఁగే లమరఁ
“గర్మబద్ధుఁడ నైతిఁ గష్టుఁడ! ఖలుఁడ:
దుర్మదో పేతుఁడ, దుష్కృతాలయుఁడఁ,
బ్రజ్ఞావిహీనుఁడ, బరమపాతకుఁడ,
నజ్ఞాని, నధిక సర్వాపరాధుండ,
శంకమాలిన యనాచారుండ; దీని
కింకఁ బ్రాయశ్చిత్త మేమియు లేదు ;
పాన లేటికి విడ్తుఁ బ్రాణంబు గెలస
మానతి యిండు నా” కని మ్రొక్కి నిలువఁ 650
గనుఁగొని బసవయ్య ఘనభక్తవితతి
యనుమతంబునఁ గూడ నతని కిట్లనియె:
“గొంకక విను! మఱికొన్ని దినముల
కింక శివద్రోహ మిట పుట్టఁగలదు !
మడియింపు ద్రోహిని మా కెక్కెఁ గెలస