పుట:Dvipada-basavapuraanamu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

బసవపురాణము

గానక బాఁపల కాళ్ళు గడ్గుటయుఁ
బరిచారకునిచేత బసవయ్య యెఱిఁగి
యరుగుట సాలించి యాగ్రహింపంగ 600
జగదేవుఁ డంతలోఁ జనుఁదేరఁ గాంచి
భుగభుగకోపాగ్ని యెగయ ముందటను
దెరచీర వట్టించి “చొర నెట్లువచ్చు
నరుగుము! భక్తజనాళిలో వెడలి
కులదైవ మిలువేల్పు మలహరుఁ డుండఁ
బలుద్రోవలనుబోవఁ బాడియే నీకుఁ ?
గఱకంఠు శుద్ధనిష్కలభక్తియుక్తి
జఱభుల కదియేల సమకూడుఁ జెపుమ!
ముల్లోకనాథుని ముట్టఁ గొల్చియును
గల్లరిలోకుల క్షణియింపఁ దగునె ? 610
హరునకు మజ్జనం బార్చుచేతులను
సరవి విప్రులకాళ్లు సరి గడ్గఁ దగునె ?
శివపాదజలములు శిరమునఁ దాల్చి
భవులకాళ్లులనీళ్లు వై నల్కఁదగునె ?
శ్రీమహాదేవుఁ బూజించుచేతులను
నామాలకుక్కల నర్చింపఁ దగునె ?
మురహరార్చితునకు మున్నెత్తుకేలు
ధరనెత్తఁ గూడునే త్రాటిమాలలకు ?
సదమలలింగప్రసాదజీవికిని
విదిత మీశ్వరభక్తి విముఖులై నట్టి 620
కర్మచండాలురఁ గలసి కుడ్చుటయుఁ
గర్మంబు గుడుచుట గాదె ? యెట్టనిన :
నదియును దివ్యాగమార్థంబులందు
మదనారిసద్భక్త మందిరంబులను
మెలఁగుపుత్త్రకళత్ర మిత్రగోత్రాది
బలఁగంబు లింగాన్వితులు గాకయున్న