పుట:Dvipada-basavapuraanamu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

241

చావకున్నను దత్ప్రసాదంబు మీర
చేకొండు ; వేయేల మీకును మాకుఁ
బ్రాకటంబుగ నింక బాస దా నిదియ ;”
యనుడు బిజ్జలుఁ డుభయానుమతమునఁ
జనుదెంచె దేవదేవుని గుడికడకు 400
బుడిబుళ్లు వోపుచు బోయలు వచ్చి
రడరఁగఁ దమకాకిపడగలు దూల :

—: బసవన్న విష మారగించుట :—


బసవఁ డసంఖ్యాతభక్తులుఁ దాను
నసమానలీలమై నరిగి యచ్చటను
గాలకూటము శృంగి ఘనవత్సనాభి
హాలాహలంబును నాదిగాఁ గలుగు
విషము లన్నియుఁ గూర్చి వేగ నూఱించి
విషమతరం బగు విషసౌరభంబు
గాలి సోఁకినమాత్ర నోలి జంతువులు
వ్రాలి యచ్చటన జీవంబులు విడువఁ 410
బై నాకసంబునఁ బాఱువిహగ వి
తానంబు దొప్పున ధరఁబడి చావ
రాగిల్ల నూఱినఁ బ్రేగులు దెగెడిఁ
ద్రాగిన బ్రదుకంగఁ దా నెట్లువచ్చు ?
ననుచు నబ్బోయలు కనుకనిఁ బఱవ
ఘన ఘోరగరళంబు లెనయంగఁ గలపి,
పసిఁడికొప్పెరల నిం పెసఁగగ నినిచి.
యసమసద్భక్త సభాభ్యంతరమునఁ
గొప్పెర ల్దీయించి కూడ నర్పించి,
యప్పుడు ధూపదీపాదు లొనర్చి 420
పంచమహావాద్యపటలంబు లులియ
సంచితకీర్తి బసవచక్రవర్తి
యామడివాలు మాచయ్యయాదిగను