పుట:Dvipada-basavapuraanamu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

233

బడిన బ్రహ్మణ గార్దభంబులతోడ 170
మహిత ప్రణవదివ్య మంత్రోపదేశ
రహితు లై చనువ్రత భ్రష్టులతోడఁ
జాల దధీచ్యాదిశాపాగ్ని శిఖలఁ
గాలినకర్మచండాలురతోడఁ
బట్టి ప్రాణముతోడఁ బశుపు వధించు
కట్టిఁడు రగు పశుకర్ములతోడ
జన్ననితోరలినఁ జాగఁగఁబెట్టు
మన్నట్టి యధికపాపాత్ములతోడ
వీసానకై యెట్టి దోసానకైనఁ
జేసాఁచికొను కర్మజీవులతోడ 180
మానుగా సురపాటిగా నర్థి సోమ
పానంబు గావించు పాఱులతోడ
నిన్నియుఁ జెప్పంగ నేల తాఁ జంపి
జన్నిసంపె నను దుర్జాతులతోడఁ
బ్రతిచేసి యాడినఁ బాపంబు వచ్చుఁ
బ్రతిన సూపమి భక్తిసంతంబు గాదు.
శివనాగుమయగారి శ్రీ హస్తమంద
నివిడి చూపెదఁ బాలు నీవన్నయట్టు !
లీమహిసురులలో నెన్నఁగఁబడ్డ
సోమయాజులఁ దర్గి చూపుఁడా నీళ్లు ! 190
ఆటుగాక తక్కినఁ గటకంబుచుట్టు
గుటిలాత్ములను దొడుగులఁ బఱపింపు"
మనుచు బిజ్జలభూసురానుమతమునఁ
జని సదాసిద్ధ బసవచక్రవర్తి
శివనాగుమయగారి శ్రీపాదములకు
భువి సమస్తాంగము ల్వొందంగ మ్రొక్కి
సన్నుతలింగపసాయితశస్త్ర
సన్నద్ధు డై మదిఁ జెన్ను దుల్కాడ