పుట:Dvipada-basavapuraanamu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

బసవపురాణము

సరస మాడినయట్లు పొరి నాగుమయ్య
కరతలాంభోజంబు గరములఁ బట్టి 200
యొత్తుడుఁ బింజించి యుడువీధిఁ దాఁకి
యత్తఱి క్షీరధారావలి వర్వె
శివభక్తి కామధేనువు బసవనికిఁ
దవిలి చన్నవిసియిబ్బువిఁ గాఱునట్లు :
కరుణించి శంభుండు గనకవర్షంబు
కరికాలచోడుకుఁ గురియించె నాఁడు !
అసలార నేఁడు దివ్యామృతవృష్టి
బసవనికిఁ గురిసె భక్తవత్సలుఁడు :
దుర్మలత్రితయ విధూతమైనట్టి
నిర్మలదేహంబు నిజ మట్ల కాదె 210
రుధిరమాసాంది నిరూపితం బగునె
యధమదేహులకుఁ గా కని లరు ల్వొగడ
దివ్యామృతాంగ దీధితి దేజరిల్లెఁ ;
బ్రవ్యక్త మై జగత్ప్రత్యయం బమర
నఖిలభక్తౌఘంబు నసదృశలింగ
సుఖసమేతాత్ము లై చూడ బిజ్జలుఁడు
నందంద నాగిదేవయ్యపాదార
విందంబులకుఁ జాఁగి వినమితుఁ డగుచు
సకలలోకంబులు జయ వెట్టుచుండ
నకుటిలభక్తిమై నంతంత మ్రొక్కి 220
'యజ్ఞానజీవుల మపగతమతుల
మజ్ఞుల మధికగర్వాపరాధులము :
శరణన్నఁ గాచు మీబిరుదు నేఁడింకఁ
బరమాత్మ : మఱవంగఁ బాడియే ! ' యనుచు
శరణువేఁడుచు నున్న చండివిప్రులను
గరుణఁ జూచుచు వారిఁ గొంచి నవ్వుచును
బసవఁ డుద్యత్సముల్లసనం బెలర్స