పుట:Dvipada-basavapuraanamu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

బసవపురాణము

హరభక్తుఁ డధమజాత్యావృతుఁ డయ్యు
ధర నున్న నేమి ? యాతనిప్రాప్తి సెడునె ?
రాజీవ మరయఁ బంకేజంబు గాదె?
పూజకు నది యెట్లు పూజ్యమై పరగెఁ !
గాష్ఠోద్భవం బయ్యుఁ గాదె పవిత్ర
నిష్ఠతం బై పొల్పె నెఱి ననలంబు ?
ఎట్టిదుర్జాతిని బుట్టిన నేమి
యెట్టును శివభక్తుఁ డిలఁ బవిత్రుండు :
ఈయగ్రజన్ముల కెల్లను గురువు
బోయెతకును గాదె వుట్టె వ్యాసుండు : 150
పూర్వద్విజాచార్యుఁ డుర్వి వసిష్ఠుఁ
డూర్వశి యనులంజె కుదయించెఁ గాదె!
మాతంగుఁ డనఁగ బ్రహ్మర్షియొకండు
మాతంగికిని గాదె మహిఁ బ్రభవించె !
శునకగార్దభ మచ్ఛశుకదర్దురాది
జనితమునీంద్రాదిజాతము లెల్ల
శినభక్తిఁ గాదె విశిష్టమై పరఁగె !
నవనీశ ! యెఱుఁగవే యందఱ" ననిన
విని బిజ్జలుఁడు రోషవిహ్వలుఁ డగుచుఁ
గనుఁగొని బసవరాజునకు ని ట్లనియెఁ : 160
"బనిలేనిమాటలు, బాటలుఁ గథలు
విన విరుద్ధము ; లాడ వేసర వీవు:
బత్తులఁ జిదిమినఁ బాలు గాఱెడినె?
నెత్తురు గాఱెడినే యొడ్లఁ జిదుమ ?
నిట్టిమార్గములు ము న్నెఱుఁగ మే” మనిన
దట్టుఁడు బసవయ దా నంత లేచి
“భర్గునిఁ గా దని పలుద్రోవ లేఁగు
దుర్గుణు లగు శివద్రోహులతోడ
నడరంగ వేదభరా కాంతు లనఁగఁ