పుట:Dvipada-basavapuraanamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

బసవపురాణము

యదిగాక గర్వించినట్టి రావణుని
నదుమఁడే శివుఁడు వాదాంగుష్ఠ మంద ?
మలహరుతో మాఱుమలసి కాముండు
నిలయెల్ల నెఱుఁగ నేఁటేఁటఁ గాలండె ? 630
కాలుని శ్వేతునికై చంపెఁ గాదె
శూలంబునను బొన్చి సురలెల్ల నదర ?
దక్షుండు గర్వించి తనఁ గోలుపడుట
సాక్షిగా దెట్లు మేషంబుశిరంబు ?
ఆదిఁ దా నఖిలలోకాధ్యిక్షుఁ డన్నఁ
గాదె భగాదిత్యు కన్నులు వెఱికె ?
దూషించి పలుక రుద్రుం డనుగణము
పూషునిపం డ్లూడఁ బొడిచెను గాదె ?
తానచూ యీ జగత్ప్రాణుఁడ నన్నఁ
బూని త్రుంపఁడె పవమానుని కాళ్ళు 640
ద్రోహిచే నాఁ డాహుతుల్ గొని కుడిచి
బాహుజిహ్వలు గోలుపడియెఁ బావకుఁడు ;
అనిమిషాధిపుచేయి" యదితినాసికము
దునుమఁడే వీరభద్రుండు రౌద్రమున ?
నమృతాంశుమేను వాదాంగుష్ఠమునను
జమరఁడే యతఁడు యజ్ఞమున కేతేరఁ
జయ్యస మును సరస్వతి ముక్కుఁగోసి
[1]వయ్యఁడే నాఁటియధ్వరములోపలను
వెండియుఁ గ్రొవ్వినవేల్పుల నెల్ల
దండించుచును జగద్రక్షణార్థముగ 650
ముల్లోకములఁ గూడ ముంచినగంగ
మల్లికాదళభాతి మౌళిఁ దాల్పండె ?
త్రిపురంబు లతిదుర్నిరీక్ష్య మై తిరుగఁ
ద్రిపురారి వోడేర్చుతివుటఁ గాల్పండె ?

  1. వైవఁడె.