పుట:Dvipada-basavapuraanamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

221

నే లెల్ల మోవఁగఁ జాలిన శేషు
వేలిముద్రికగాఁగ దాలిచెఁగాదె ?
సంగతి విషవహ్ని జంబూఫలంబు
మ్రింగినభావన మ్రింగఁడే హరుఁడు ?
అంధక సింధుర వ్యాఘ్రలాలాజ
లంధ రాదుల నిర్ధళనము సేయండె ? 660
యింతింతవనులకు నీశ్వరుం డేల ?
కంతుసంహరు నొక్కగణము సాలండె !
యొక శివగణముచే సకలలోకములు
ప్రకటంబుగాఁ జెడుఁ బ్రభవించు మించు
నన మహాదేవు మహత్త్వంబునకును
నెన యున్న దే ! యింక నిన్నియునేల
నిత్యుండ నేన యనిత్యు లందఱును
సత్య మిట్లనుచు సజ్జనసాక్షికముగ
నిత్యస్వరూప వినిశ్చితదృష్ట
ప్రత్యయంబుగఁ దాల్పఁబడియున్న యట్టి 670
హరివిరించుల కపాలాస్థిమాలికలు
కరి గాదె యీశుండు కర్త యౌటకును ?
నదిగాక యుపమన్యుఁ డను మునిచేతఁ
బదపడి శివదీక్షఁ బడసి విష్ణుండు
సొంపున నింద్రనీలంపులింగంబు
నింపార సజ్జయం దిడి కొల్చెఁ గాదె ?
వెన్నుండు దా నిత్య వేయుఁదామరల
నున్నతిఁ బూన్పఁ నం దొకటి లేకున్నఁ
గన్నప్డు వుచ్చి శ్రీకంఠుఁ బూజించి
కన్నును నాఁటి చక్రముఁ బడయండె ? 680
మత్స్యావతారుఁడై మఱి లంకలోన
మత్స్యకేశ్వరు నిల్పి మఱి కొల్చెఁగాదె ?
మున్ను దోరసముద్రమునఁ గూర్మనాథుఁ