పుట:Dvipada-basavapuraanamu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

219

నుగ్రాక్షుమూఁపున నున్నదే కాదె ?
మా దేవ దేవుని పాదపీఠమునఁ
గాదె లక్ష్మీశ్వరుక న్నున్నయదియు ? 600
మృడు(డు విష్వక్సేనుఁ బొడిచి యెత్తు డును
గడఁగి శూలంబునఁగాదె యున్నాడు ?
అత్తఱిఁ గలికేతుఁడై కేశవుండు
నెత్తురు వఱపఁడే నిటలాక్షు మ్రోల ?
సంతతంబును శ్రుతి సన “హరిగ్ంహ
రంతం" బనుచు మ్రోయు రౌద్రభావమున
హరిని హరించుట హరిహరుం డయ్యె ;
హరుఁడు సేతోజాతహరుఁ డఘహరుఁడు
శ్రుతులు “యజ్ఞస్య శిరోభిన్న" మనఁగఁ
గ్రతుపురుషునిం జంపఁ గడుఁగోపమునను 610
వెనుకొని తునుమఁడే వీరభద్రుండు ?
చని కేశవునితల జన్నంబులోన
నవలేపమునఁ బొంది దివిజాధ్వరమునఁ
దివిరి విష్ణుఁడు దలఁదెగఁ గొట్టువడఁడె ?
యతఁ డేల ? యెవ్వఁ డహంకరించినను
రతిపతిహరునిచే బ్రతుకఁగఁగలఁడె ?
వసిగొని హరియు దేవతలు నెత్తంగ
వెస నోపిరే యక్షవినిహితతృణము ?
మించి మున్ బ్రహ్మ గర్వించిన శివుఁడు
త్రుంచివై వఁడె వానిపంచమశిరము 620
హరిణ మై కూఁతురి వరియింప నజుని
హరియింపఁడే మృగవ్యాధ రుద్రుండు ?
అతని పుత్రుండు నహంకారి యగుడు
క్షితి నుష్ట్ర మైయుండఁ జేయఁడే హరుఁడు ?
వాసు దేవుండు దైవం బని యెత్తు
వ్యాసునిచేయి నిహత మయ్యెఁగాదె ?