పుట:Dvipada-basavapuraanamu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

బసవపురాణము

మును మృగచండాల మను గార్దభంబు
వనజాక్షు ప్రాణంబు సనఁ గాచెఁగాదె ? 570
హరుఁడు విసము ద్రాగి యమృతంబుఁ బనుప
హరి మగఁటిమి విడ్చి యాఁటదిగాఁడె ?
బలిఁ గిట్టి భువిఁ గొన్న పాపంబుక తన
నిలగోలుపడి హరి జలధి సొరండె ?
యాలిఁ గోల్పడి రాముఁ డట బ్రహ్మహత్య
పాలయి ధర చుట్టు భ్రమరించెఁ గాదె ?
పోటరి విష్ణుండు బోయచేఁ గాల
నేటువ డీల్గఁడే యిల యెల్ల నెఱుఁగ ?
వేయేల వ్రేవాడ వెన్న మ్రుచ్చిలుచుఁ
బోయి ఱంకాడఁడే పొలఁతులతోడ 580
నోలి నందీశ్వరు నూర్పులఁ దగిలి
పోలేక వచ్చుచుఁ బోవుచుండండె ?
హరి దాన దైవంబ నని జగం బెఱుఁగ
నురులింగమూర్తిచే నుబ్బణంగండె ?
మృడుఁ బెక్కుయుగములు మేఘరూపమునఁ
గొడుకు నర్థించి దాఁ గొలువఁడే శార్జ్గి?
మత్స్యావతారంబు మడియించికాదె
మత్స్య కేతనవైరి మఱి తలఁ జుట్టెఁ ?
బరఁగఁ దత్కూర్మకపాలంబు గాదె
హరుహారమధ్యంబునం దున్నయదియు ? 580
బ్రాఁతిగా నాదివరాహదంష్ట్రంబు
ఖ్యాత మీశ్వరుచేతఁ గాదె యున్నదియు ?
శరభరూపము దాల్చి పొరిమాల్చీకాదె
నరసింహుతోలు శంకరుఁడు దాఁగట్టె ?
పొట్టి త్రివిక్రము నెట్టెమ్ముగాదే
పట్టె ఖట్వాంగము భాతి శంకరుఁడు ?
నగ్రజుఁ డగు విష్ణు నక్క ళేబరము