పుట:Dvipada-basavapuraanamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

217

నిజనామ మది యథోక్షజుఁ డయ్యెఁ గాదె ? 540
యదిగాక యదితి కింద్రానుజుఁ డనఁగ
నుదయించెఁ గాదె పయోజనాభుండు ?
ఆదట ద్వాపరమందు విష్ణుండు
బాదరాయణుఁ డనఁ బ్రభవించెఁగాదె ?
యయ్యుగంబునను ము న్నచ్యుతుం డుదయ
మయ్యెనుగాదె కృష్ణాఖ్యుండు నాఁగ ?
విష్ణుఁ డొక్కొక్కెడ విలయంబుఁ బొంద
విష్ణుత్వ మర్థించి విశ్వేశుఁ గొలిచి
యొక్కొక్కఁ డుదయించె నొగి విష్ణుఁ డనఁగ
నెక్కడఁ బట్టి యింకెన్నిజన్మములు 550
నతనిబాములు విను మవనిపాలుండ !
శ్రుతిమూలముగఁ జూడు ప్రతివాద మనక :
తగిలి దూర్వాసుండు దన్నినఁగాదె
నగధరువక్షంబునను మచ్చ యయ్యె ?
హరిని రుక్మిణిఁ గూడ నట్లును గాక
కరమర్థితో బండిగట్టి తోలండె
యమృతాబ్దిసేవన నయ్యుపమన్యుఁ
డుమియఁడే కుత్తుక నున్న కేశవుని ?
హరిని జలంధరుం డనునొక్క యసుర
పొరిమాల్చెఁగాదె నభోమార్గమునను ? 560
జలమఱి యొక జరాసంధున కోడి
యిలదుర్గమును బన్నఁడే కేశవుండు ?
నవ్విష్ణుని భదానవాదిరాక్షసులు
మువ్వురు సలపట్టు టెవ్వరు వినరె ?
యేచి విష్ణుండు దధీచిఁ జక్రమున
వైచుడు వీఁపొగ్గి యాచక్ర మపుడ
తునియలుగాఁ గొట్టుచును నతం డెగుదఁ
గనుకని దలవీడఁగాఁ బాఱెఁ గాదె?