పుట:Dvipada-basavapuraanamu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

211

[1]జోళవాళిక కాక [2]వేళవాళికినె
వత్తురే ? యన్యదైవంబులయిండ్లు
చొత్తురే ? భక్తులు సూతురే ! విండ్రె ? 370
లింగైకనిష్ఠావిలీనుండు భృంగి
యంగజారాతికి నతివ యైనట్టి
యర్ధనారికి మ్రొక్క కభవునిదక్షి
ణార్థ మేర్పఱిచియు నట మ్రొక్కె ననిన
నిట వేయు నేల మాహేశ్వరవితతి
చిటిపొటివేల్పులఁ జీరికిఁ గొండ్రె ?*
కావున మాభక్తగణములమహిమ
నీ వేమి యెఱుఁగుదు నిఖిలేశ్వరుండ :
యన నేలవేయు నట్లైన బాచరసు
ఘనమహత్త్వము సూతుగాదె తొల్లియును 380
నణఁకించి పలుకఁ దత్ క్షణమాత్ర నీవ
ప్రణుతింప సోమేశు రప్పించుకొనఁడె?
కొట్టరువునఁ బళ్లు గోటానకోట్లు
పెట్టియు మనుజులపేళ్ళు వ్రాయండు ;
కదియఁ బంచాక్షరి కవిలియ వ్రాసి
చదువు లెక్కలు వెర సది దప్పకుండ ;
నెఱుఁగుదుగాదె ము న్నేఁ జెప్ప నేల ?
యెఱుఁగుదుగా కేమి యటమీఁదిపనులు ?”
నంచును వృత్తాంత మంతయు బసవఁ
డంచితమతి విన్నవించి పుచ్చుడును 390
“వాద మన్నను బోవవలయుట తగపు
గాదె" యంచును సమద్గతకోపుఁ డగుచుఁ
జనుదెంచి భక్తులఁ గని మ్రొక్కి నిలువ
జననాథుఁ డాగ్రహంబున నిట్టు లనియె :

  1. చోళ్ళు (జీవన భృతి) పరిపాటిగాఁ గలది; ఐహిక జీవనము.
  2. జీవితావసాన వేళకు వాళియైనది; ఆముష్మికజీవనము.