పుట:Dvipada-basavapuraanamu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

బసవపురాణము

“నరుదగు నఖిలలోకాదీశుఁ డైన
హరిప్రతిష్ఠకు నమాత్యవ్రాతమెల్లఁ
జనుదేర నీ వేల చనుదేర విచటి?"
కనుడుఁ గోపోద్దీపితాంగుఁ డై పొంగి
“పుట్టఁ బుట్టువుమాలి చుట్టుముట్టాడు
నిట్టిట్టివేలుపు లెట్టు నరేంద్ర | 400
కర్త లనియెదవు కర్తలిం దెవరు ?
కర్తల కర్త మత్కర్తయ కాదె !
కర్తవ్య మింతయుఁ గర్త శంభుండు
కర్తవ్య మెందును గర్తకు సరియె !
కర్త ప్రధానుండు గాక తక్కెల్లఁ
గర్తయు హర్తయుఁ గలఁడె వేఱొకఁడు ?
హరియును గిరియును నజుఁడును గిజుఁడు
సురలును గిరలును హరునిసమంబె ?
యిల 'మమ కర్తా మహేశ్వర' యనుచుఁ
బలికెడు విష్ణుఁడు పరమేశుఁ డగునె? 410
యటుగాక స్థితికర్త యందమే విష్ణుఁ
డిట పుత్త్రు రక్షింప నెలొకో లేఁడు ?
నలువ దైవం బనుపలుకులు మున్నె
పొలిసెఁగాదే ! తలవొలిసినయపుడు ;
కాఁడువో యుత్పత్తికర్తయు నజుఁడు
పోఁడిగాఁ దనతలఁ బుట్టించుకొనఁడె?
ధర జినబౌద్ధులు దైవంబులేని
నరరూపు లై యుండుదురె మహత్తణఁగి ?
పశుకర్ములగు వేదబాహ్యులువారు
పశుపతు లగుదురె? ప్రత్యక్ష మిదియు 420
నన నేల 'హస్తినాహన్యమానో ౽పి"
యన నిరీశ్వరుని విశ్వాలయుఁ డనఁగ
నేనుఁగు వెన్కొని యెగిది మట్టాడు