పుట:Dvipada-basavapuraanamu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

213

చోనైన వసదులు సొరరెట్టివారు
మాయ దైవం బనుమాట లేమిటికి ?
మాయ దా నట పేరు మఱి దైవ మగునె ?
హరునధికారులు నజుఁడును హరియు ;
నరయంగ శ్రుతిబాహ్యు లాయున్న ముగురు :
నెవ్వండు గర యీయేవురియందు
నెవ్వి దర్శనము లి ట్లెన్నఁగ నాఱు 430
శ్రుతి "ఏకఏవ రుద్రో" యన్నయట్టు
లితరదైవంబుల నెన్న నేమిటికి ?
వేదంబు దైవమే వేయును నేల ?
నాదిసోమకుచేత నపహృతం బగునె ?
తలరునే పృథివియు దైవ మేనియును
నిలయమై యుండునే మలమూత్రములకు ?
నెఱయ దైవమె నీరు నిట్టపాటులను
వఱలునె యణఁగునె యఱచేతియందు ?
ననలుఁడు దైవ మే నటు భంగపడునె
మును సర్వభక్షుఁడై చనునె లోకముల ? 440
నక్కరువలి దైవ మండ్రేని నొక్క
దిక్కున నుండునే దిక్పాలుఁ డనఁగఁ ?
దలఁప నాకాశంబు దైవ మండ్రేనిఁ
బ్రళయంబుఁ బొందునే ప్రమథులచేత ?
నిలుకాల నిలువఁగ నేరక తిరుగు
నిల దినేశుండు సర్వేశ్వరుం డగునె?
యానిశాపతి దైవ మన నెట్లువచ్చు?
నానాఁటికిని గళానష్టతఁ బొందు ;
నఖిలంబునకుఁ గర యాత్మ యేనియును
సుఖదుఃఖములఁ బొంది సొగయుచు నున్నె ? 450
కావున మున్ని ట్లొకం డొకొక్కటికి
దైవంబు లేనియుఁ దారు వుట్టుదురె ?