పుట:Dvipada-basavapuraanamu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

బసవపురాణము

గురునాథుఁ డిన్నియుఁ గూడ బాచాంక
వరదివ్యమూర్తిగా విరచించెనొక్కొ !
కానినాఁ డిటువంటి కలియుగరుద్ర
మానితపృథు దివ్యమహిమ యెట్లొనరు ! "
ననుచు లోకంబు లత్యర్థిఁ గీర్తింప
ననురాగలీల నూనిన భక్తియుక్తి 230
'సిద్ధాంతముల శ్రుతిస్మృతిమూలములను
బద్ధవేదాంతసంపాదితో క్తులను
న్యాయవై శేషి కాద్యఖిలశాస్త్రముల
నాయతబహుపురాణాగమార్థముల
సహజానుమానాదిసర్వప్రమాణ
బహుతర్క వాదజల్ప వితండములను
వెలయు నుత్పత్తిస్థితిలయ కారణుఁడు
నలరు నిత్యానందు ' డంబికాధవుఁడు
పశుపతి దాఁ గర్త వలువేల్పు లెల్లఁ
బశువులే' యని ప్రతిపాలన సేసి , 240
జినసమయస్థుల శిరములు దునిమి,
మును విష్ణుసమయులముక్కులు గోసి,
యద్వైతులను హతాహతముగాఁ దోలి,
విద్వేషవాదుల విటతాట మార్చి,
చార్వాకవాదుల గర్వం బడంచి,
సర్వేశుభ క్తియే యుర్వి నిష్ఠించి,
దిట్టయౌ షొడ్డలదేవు బాచయ్య
యిట్టి సద్భక్తిమహిష్ఠుఁడై నడవ
నెడనెడ సౌరాష్ట్ర మేఁగి యేఁటేఁటఁ
గడునర్థితోడ జాగరము సెల్లించు 250
దిన మేఁగుదెంచుఁడు 'దివుట సౌరాష్ట్ర
మున జాగరము సేయఁ జనియెద' ననుచు
బిజలునకు వినిపింపఁగ నతఁడు