పుట:Dvipada-basavapuraanamu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

207

“కజ్జ మెంతేనియుఁ గలదు వోరాదు :
కొట్టరువునఁ బళ్ళు గొలువఁగవలయు ;
నిట్టేల చెల్లు నీ కిరుదెస కొలువు ?
బాలెంతలంజియపడుపట్ల రాచ
యూళిగంబును భక్తియునుగూర్చి నడవ
సౌరాష్ట్రమున కీవు సనుము ; గాదేని
సౌరాష్ట్రనాథుఁడు సనుదేర నిమ్ము : 260
శివరాత్రి గివరాత్రి సేయుట మాను ;
తవిలి యీయుళిగంబు దప్పింపరాదు"
అనుచు నప్పరవాదు లనుమతంబునను
జనపతి వారించుడును బోక నిలిచి
“ముదలించి పలుకులు మూర్ఖుఁడై పోక
యదియుఁ గష్టముగాదె యతఁడన్నయట్లు
వచ్చు నిచ్చటికొండె వరదుఁడు నాకు
నచ్చటి కేఁగునట్లయ్యెడు నొండె
దీనఁ దప్పినదేమి నానిజవ్రతము
తా నెట్లు శివునకుఁ దప్పింపవచ్చు?" 270
ననుచు నిశ్చింతాత్ముఁడై యున్నయెడను
ఘనుఁడు సోమేశుఁ డాదినము దొల్నాఁడు
మడఁపు లేఖయు నందిపడగయుఁ గొనుచుఁ
బడిహారిక్రియఁ బట్టపగలె యేతెంచి
కొట్టురువునఁ బళ్ళు గొలిపించుచుండ
నట్టిచో బాచయ్య కాతఁడి ట్లనియె :
‘‘సౌరాష్ట్ర నాథుండు సనుదెంచుచుండి
భోరన ముందఱఁ బుత్తెంచె నన్ను
శంకరు నానతిఁ జదువుకో లేఖ
యింకిటపూఁటకు నేఁగుదెంచెడిని ; 280
నాసక్తిమై నింక ననిశంబు మీని
వాసంబునన యుండవలయుఁ గావునను