పుట:Dvipada-basavapuraanamu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

205

అనుపమశౌర్యు నేకాంతరామయ్య
ననురాగలీలమైఁ గొనియాడుచుండ
ననయంబు బసవఁడు దనసంగ మేశుఁ
డని భకిఁ గొల్వ నేకాంతరామయ్య 200
వరకీర్తిమై నిట్లు వర్తింపుచుండె.
ధర లసద్భక్తివిస్ఫురణమై మఱియుఁ
బ్రథితుఁ డీయేకాంతరామయ్య దివ్య
కథ విన్న వ్రాసిన గారవించినను
జలహాలహలవహ్ని శస్త్రాస్త్ర బాధ
నలి నాగ మృగరోగములభయం బణఁగు
విపులదృష్టాదృష్ట వివిధ సౌఖ్యములు
నపవర్గములు గల్గు హరుకృపఁజేసి.

—: షొడ్డలదేవు బాచయ్యగారి కథ :—


ధీరుండు షొడ్డలదేవు బాచయ్య
గారు నా వెండియుఁ గఱకంఠమూర్తి 210
నిర్గతేంద్రియ వైరివర్గదుర్గుణుఁడు,
భర్గనిరర్గళాంతర్గతధ్యాని,
యుగ్రాక్షభక్తగణాగ్రగణ్యుండు.
నిగ్రహానుగ్రహోదగ్రశౌర్యుండు.*
పరదైవ పర్వత ప్రధితదంభోళి,
పరదైవసందోహతరుకుఠారంబు,
పరదైవశుండాలపంచాననుండు,
పరదైవవార్ధిశుంభత్కుంభజుండు :
“త్రినయనునతులితోద్రిక్తశౌర్యంబు
చను నందికేశ్వరు సర్వజ్ఞతయును 220
భృంగినాథుని యేకలింగనిష్ఠయును
భంగిగా నవ్వీరభద్రురౌద్రంబు
భృగుదధీచ్యాదులపృథుశాపశక్తి
తగు గౌతుమాదుల తర్కప్రయుక్తి