పుట:Dvipada-basavapuraanamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

175

ప్రతివచ్చునే యెన్ని భంగులనైన ?
ననిశంబు నతని కాయకలబ్ది యెంత
యన నేల? నేఁడు నాఁ డనక తూమెండు 370
సంతతంబును గూడు జంగమకోటి
సంతుష్టి సేయు టాశ్చర్యంబు గాదె ?
బాపు ! మోళిగమార : భక్తివిస్తార !
బాపురే” యనిమ్రోలఁ బ్రస్తుతి సేయ
నసలార విస్మితుం డగుచు నేతెంచి
బసవఁడు ప్రచ్ఛన్నభావంబు నొంది
మోళిగమారయ్య ముద్దియఁ గాంచి
లాలితోద్యత్సముల్లాస మెలర్ప
'శరణార్థి' యని చక్కఁ జాఁగి మ్రొక్కుడును
దరుణియు నటమున్న 'శరణార్థి' యనుచు 380
నడుగుల కర్ఘ్యపణ్యంబులు దేర
నొడఁబడ కెఱిఁగెదరో యనుమతిని
“అమ్మమ్మ : మాలింగ మాకొన్నవాఁడు
క్రమ్మన వడ్డింపు రమ్ము లె" మ్మసుచు
సరసర లింగావసరము సెల్లించి
పరికించి యం దొక్కవడిగంబు క్రింద
విడియలతో రెండువేలమాడలును
[1]నడకి యమ్మకు శరణార్థి సేయుచును
సదమలలింగప్రసాదంబు గొనుచు
విదితముత్పులక సముదితాత్ముఁ డగుచు 390
ధర నిఱుపేద నిధావంబుఁ గన్న
కరణిని హర్షాశ్రుకణములు దొరుగ
“నిదిగదా భవదుఃఖగదము నౌషధము ;
యిదిగదా భక్తిమహిష్ఠతపంట :
ఇదికదా నాపుట్టినింటి కల్పకము !

  1. ఇఱికించి.