పుట:Dvipada-basavapuraanamu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

బసవపురాణము

ఇదిగదా ముక్తికి నిక్క దా" ననుచుఁ
బొంగి ప్రసాదైకభోగియై తద్దృ
హాంగణంబున నిల్చి యాత్మలోపలను
“నీసదనం బంత నింతఁ గన్నంత
దోసంబులెల్లి విధూతము ల్గావె ; 400
యీనగరద్వార మిఱియ నేతెంచు
నానరుఁ డపుడ కృతార్థుండు గాఁడె ;
యీసీమలోఁ జరియించు జంతువులు
చేసినభాగ్యంబు సెప్పంగఁ దరమె ?
యీగృహాంతరరేణు విసుమంత నొసల
బాగొందు నతనికి భక్తి వర్ధిలదె ?
కడిఁదిపాతకము లిక్కడఁ బ్రసాదంబు
గుడిచినఁ జెడు సమకూఱ దేనియును
నొడఁబడ నిచ్చటి [1]కడువునీరై నఁ
బుడి సెఁడు ద్రావినఁ బొలియుఁ బాపములు " 410
నని తలపోయుచుఁ జనియె నా బసవఁ
డనురాగచితుఁడై ; యంత నిక్కడను
మధ్యాహ్న మగుటయు మారయ్య లింగ
తధ్యానసుఖనిరంతరవర్తి యగుచు
వాకిటఁ గట్టెలు వైచి యేతేర
నాకాంత యెదురేఁగి యడుగులు గడుగ
భంగిగా జంగమప్రణిపత్తి దీర్చి
లింగార్చనంబు సల్లీలఁ జేయుచును
బడిగంబు క్రిందట బసవఁడు మున్న
యడకిన మాడల విడియలు గాంచి 420
“యెక్కడి విడియ లిం ? దెవ్వరు వచ్చి
రిక్కడ ?" కని తనయుంతి నడ్గుడును
“దేవ ! యొక్కయ్య యేతెం చారగించె

  1. బియ్యము కడిగిన నీరు.